ఇన్వెస్టర్ మరణిస్తే మ్యూచువల్‌ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లకు ఏమవుతుంది?

Video

మీరు క్లోజ్డ్ ఎండెడ్ ఇఎల్‌ఎస్ఎస్ లేదా ఎఫ్ఎమ్‌పిలు లాంటి ఇతర క్లోజ్ ఎండెడ్‌లో ఇన్వెస్ట్ చేస్తే తప్ప సాధారణంగా మ్యూచువల్‌ ఫండ్ స్కీములకు మెచ్యూరిటీ తేదీ ఏదీ ఉండదు. ఎస్ఐపి విషయంలో కూడా, ఇన్వెస్ట్మెంట్లు రెగ్యులర్‌గా చేయడానికి షరతు ఉంది. ఎస్ఐపి టర్మ్ ఆన్‌లో ఉండి క్లోజ్ ఎండెడ్ స్కీము కన్నా ముందు లేదా ఆ నాడు ఇన్వెస్టర్ మరణిస్తే నామినీలు, జాయింట్ హోల్టింగ్ సందర్భంలో సర్వైవర్లు లేదా ప్రొసీడ్‌ను క్లెయిం చేయడానికి చట్టపరమైన వారసులు అనుసరించవలసిన నిర్వచించబడిన ప్రక్రియలు ఉన్నాయి. ఈ ప్రక్రియని ట్రాన్స్‌మిషన్ అంటారు. ట్రాన్స్‌మిషన్ కొరకు ఒకరి అభ్యర్థించడానికి, ముందుగా ఆ వ్యక్తికి మీ మ్యూచువల్‌ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ల గురించి అవగాహన ఉండాలి, లేకపోతే ఎప్పటికీ క్లెయిం చేయకుండా ఉండిపోతుంది.

కావున, ఏదైనా ఇతర ఇన్వెస్ట్మెంట్ల లాగే ఎల్లప్పుడూ మ్యూచువల్ ఫండ్స్‌కి కూడా నామినీని చేర్చి మరియు దాని గురించి నామినీకి తెలియజేస్తూ ఉండమని సలహా ఇవ్వడమైనది. మీకు జాయింట్ అకౌంట్ హోల్డింగ్ ఉంటే, ట్రాన్స్‌మిషన్ కొరకు మీ అకౌంటులో తెలుపబడిన సర్వైవర్లు క్లెయిం చేసుకోవచ్చు. కానీ మీకు నామినీలు లేకుండా లేదా మీ ఫోలియోలో తెలిపిన సర్వైవింగ్ జాయింట్ హోల్డర్లు లేకపోతే, మీ చట్టపరమైన వారసులు ఇంకనూ అన్ని అవసరమైన డాక్యుమెంట్లు మరియు డెత్ సర్టిఫికేట్ రుజువులు సమర్పించడం ద్వారా ట్రాన్స్‌మిషన్ కొరకు క్లెయిం చేయవచ్చు. ట్రాన్స్‌మిషన్ కొరకు అభ్యర్థిస్తున్న వ్యక్తి కెవైసిని నమోదు చేయాలి.

407

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?