మైనరులు తమ తల్లిదండ్రులు/సంరక్షకుల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయవచ్చు. ఈ సందర్భంలో మొదటి మరియు ఏకైక ఖాతాదారు మైనరు మరియు ఒక సహజ సంరక్షకుని (తండ్రి లేదా తల్లి) ద్వారా గానీ లేదా (న్యాయస్థానం నియమించిన) చట్టపరమైన సంరక్షకుని ద్వారా గానీ ప్రాతినిధ్యం వహించబడుతారు. సహజ సంరక్షకుని ద్వారా ప్రాతినిధ్యం వహించబడుతున్న ఒక మైనరు 18 సంవత్సరాల వయస్సు వద్ద మేజర్ అవుతాడు అయితే చట్టపరమైన సంరక్షకుల ద్వారా ప్రాతినిధ్యం వహించబడుతున్న వారు 21 సంవత్సరాలకు మేజర్లు అవుతారు.
మైనరు ఒకసారి మేజర్ అయ్యాక, ఏకైక ఖాతాదారు యొక్క స్టేటస్‌ను మైనరు నుండి మేజరుకు మార్చేందుకు మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది లేదంటే ఖాతాలోని అన్నీ భవిష్య లావాదేవీలు (SIP/SWP/STP) నిలిపివేయబడతాయి. అవసరమైన పత్రాలను ముందస్తుగా సమర్పించవలసిందిగా సంరక్షకునికి, అలాగే మైనరుకు ఒక నోటీసును సాధారణంగా మ్యూచువల్ ఫండ్లు పంపుతాయి. ఒక బ్యాంకు అధికారి ధృవీకరణతో కూడిన మైనరు సంతకంతో బాటుగా సదరు స్టేటస్‌ను మేజరుకు మార్చేందుకు సంరక్షకుడు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. బ్యాంకు ఖతా నమోదు పత్రం మరియు మైనరు కెవైసీ కూడా దరఖాస్తుతో బాటుగా సమర్పించవలసి ఉంటుంది.
పన్ను చిక్కులు ఇప్పుడు ఏకైక ఖాతాదారుడు (మేజరు) భరించవలసి ఉంటుంది. చిన్నారి మైనరుగా ఉన్నంతవరకు, చిన్నారి ఖాతా నుండి అన్నీ ఆదాయాలు, లాభాలు తల్లి/తండ్రి/సంరక్షకుని ఆదాయం కింద కలపబడతాయి, ఇంకా వర్తించే పన్నులన్నింటినీ తల్లి/తండ్రి/సంరక్షకుడు చెల్లిస్తారు. మైనరు మేజరుగా మారే సంవత్సరంలో, అతడు/ఆమె ఒక ప్రత్యేక వ్యక్తిగా పరిగణించబడుతూ, ఆ సంవత్సరంలో అతడు/ఆమె మేజరుగా ఉన్నన్ని నెలల కొరకు పన్నులను చెల్లిస్తారు.