‘రెగ్యులర్’ పిజ్జా కన్నా ఒక ‘లార్జ్’ పిజ్జాను మీరు ఆర్డర్ చేసినప్పుడు, రెండింటి రుచిలో మీకేమైనా తేడా కనిపిస్తుందా? ఖచ్చితంగా ఉండదు! రెండూ ఒకే రెసిపీతో, ఒకే ప్రక్రియ ద్వారా తయారుచేయబడ్డాయి. కేవలం వాటి పరిమాణం మరియు ధరలోనే వ్యత్యాసం. మెనూ నుండి మీరు ఆర్డర్ చేసే ఒక ఫాంహౌజ్ పిజ్జా యొక్క పరిమాణంతో సంబంధం లేకుండా ఒకే రుచిని మీరు పొందుతారు.
మ్యూచువల్ ఫండ్లు కూడా పిజ్జాల మాదిరిగానే అదే రుచిని అందిస్తాయి. మీరు ఒక ఫండును కొన్నప్పుడు, మీరు దాని ధరను చెల్లిస్తారు అనగా ఫండ్ యొక్క ఒక యూనిట్‌ను స్వంతం చేసుకునేందుకు NAV మరింత మంది పెట్టుబడిదారులు తమ నగదును పెట్టుబడి చేస్తున్న ఒక పెద్ద ఫండుకు పెద్ద అసెట్ బేస్ ఉంటుంది, కాబట్టి అత్యధిక NAV ఉంటుంది. అయితే అదే ఫండ్, ఆరంభించబడిన సమయంలో అత్యల్ప NAV ని కలిగి ఉండి ఉండవచ్చు ఎందుకంటే సదరు ఫండ్‌లో మరింత మంది పెట్టుబడిదారులు చేరడంతో ఫండ్ ఎదుగుతుంది కాబట్టి ఒక ఫండ్ యొక్క NAV కాలానుగుణంగా పెరుగుతుంది. అయితే దాని అర్ధం ఫండ్ రెసిపీ మారిందనా లేదా దానిని తయారుచేసే విధానం మారిందనా?
ఫండ్ యొక్క పెట్టుబడి ఉద్దేశ్యం మారనట్లైతే వివిధ అసెట్ వర్గాలు మరియు సెక్యూరిటీల రకాలు మరియు ఫండ్ యాజమాన్య ప్రక్రియ అలానే ఉంటాయి. కాబట్టి ఫండ్ యొక్క NAV తో సంబంధం లేకుండా మీ రిటర్న్ అనుభవం ప్రభావితం కాకుండా ఉంటుంది, ఎలాగైతే మీ ఫాంహౌజ్ పిజ్జా స్లైస్ పరిమాణంతో సంబంధం లేకుండా దాని రుచి ఉంటుందో అలా అన్నమాట.