ఈక్విటీ, ఋణ నిధులు వేర్వేరు రిస్క్ కారకాలను కలిగి ఉంటాయా?

Video

ఈక్విటీ ఫండ్లు కంపెనీల స్టాకులలో పెట్టుబడి చేస్తే, ఋణ నిధులు కంపెనీల బాండ్లలో, నగదు వాణిజ్య ఉపకరణాలలో పెట్టుబడి చేస్తాయి. ఈ ఫండ్లు మన నగదును వివిధ అసెట్‌లలో పెట్టుబడి చేస్తాయి కాబట్టి, సదరు అసెట్ క్రిందకు వచ్చే శ్రేణులను ప్రభావితం చేసే రిస్క్ కారకాల చేత అవి ప్రభావితం అవుతాయి.

మార్కెట్లోని హెచ్చుతగ్గుల వలన స్టాక్‌లు ప్రభావితమవుతాయి. కాబట్టి ఈక్విటీ ఫండ్‌లను ప్రభావితం చేసే ఏకైక అతిపెద్ద రిస్క్ కారకం, మార్కెట్ రిస్క్. మారకం ధరలోని హెచ్చుతగ్గుల కారణంగా కరెన్సీ రిస్కును అంతర్జాతీయ ఈక్విటీ ఫండ్లు కూడా ఎదుర్కుంటాయి. ఆర్ధిక మరియు పారిశ్రామిక రిస్కులకు ఈక్విటీ ఫండ్లు మరింత ఉన్ముఖంగా ఉంటాయి, ఎందుకంటే ఒక కంపెనీ యొక్క ఆర్ధిక వాతావరణం మరియు వ్యాపారం మీద ప్రభావం చూపే కారకాల చేత స్టాక్సు నేరుగా ప్రభావితమవుతాయి.

బాండ్స్ అనేవి ఋణాన్ని అందించే ఉపకారణాలలో ఒక రకమే కాబట్టి వడ్డీ రేట్లలోని మార్పులు బాండ్ల మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి, వడ్డీ రిస్క్ అనేది ఋణ నిధులను ప్రభావితం చేసే అతిపెద్ద రిస్క్ కారకం. బాండ్లు కూడా డీఫాల్ట్ మరియు క్రెడిట్ తగ్గింపులకు అనుగుణంగా ఉంటాయి అంటే, బాండు క్రింది చెల్లింపులను గౌరవించడంలో బాండ్ ప్రదాత విఫలం కావడం లేదా బాండ్ చెల్లింపులను గౌరవించే తమ సామర్ధ్యాన్ని దుర్భలపరచగల ఆర్ధిక సంక్షోభంలోకి వెళ్ళే అవకాశం. కాబట్టి ఋణ నిధులు గణనీయమైన డీఫాల్ట్ మరియు క్రెడిట్ రిస్కును ఎదుర్కుంటాయి.

రెండు రకాల ఫండ్లు లిక్విడిటీ రిస్కుకు లోనవుతాయి. అంటే ఫండ్ నిర్వాహకునికి పోర్ట్‌ఫోలియో నుండి కొన్ని హోల్డింగులు ఒకవేళ తక్కువగా ట్రేడ్ చేయబడినా లేదా ఆ సెక్యూరిటీకి డిమాండు తగ్గినా వాటిని అమ్మడం కష్టతరం కావచ్చు,

402