మ్యూచువల్ ఫండ్‌లలో నేను నేరుగా ఎలా పెట్టుబడి పెట్టగలను?

Video

మీ కెవైసి పూర్తి అయి ఉంటే, మీరు మ్యూచువల్ ఫండ్‌లలో ఆఫ్‌‌లైన్ లేదా ఆన్‌‌లైన్ ద్వారా నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. ఆన్‌లైన్ లావాదేవీలు జరపడం మీకు అసౌకర్యంగా ఉన్నట్లైతే, వారి సమీప శాఖకు వెళ్ళి ఒక ఫండ్‌లో మీరు పెట్టుబడి పెట్టవచ్చు.  

మ్యూచువల్ ఫండ్‌లలో నేరుగా పెట్టుబడి పెట్టడానికి ఆన్‌‌లైన్ చాలా అనుకూలమైనది, మీరు కమీషన్లు కూడా మిగుల్చుకోవచ్చు. మీరు ఒక ఫండ్ వెబ్‌సైట్ లేదా దాని RTAల సైట్  లేదా ఫైన్‌టెక్ ప్లాట్‌ఫారం ద్వారా ఆన్‌‌లైన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఒక ఫండ్ వెబ్‌సైట్‌లో నేరుగా పెట్టుబడి పెట్టడానికి అనేక లాగిన్స్‌ను నిర్వహించాల్సి ఉంటుంది.  

డైరెక్ట్ ప్లానులో పెట్టుబడి పెట్టడం అంటే అర్థం, మీ ఆర్థిక ప్లానును సృష్టించడానికి, మీ లక్ష్యాలకు అత్యంత అనుకూలమైన ఫండ్‌లను ఎంచుకోవడానికి , అవసరం అయితే రీబ్యాలెన్స్ చేయడానికి క్రమం తప్పకుండా పోర్ట్‌ఫోలియోను పర్యవేక్షించడానికి మీరు బాధ్యత తీసుకుంటారు. సరైన ఫండ్‌లను ఎంచుకోవడానికి మరియు పోర్ట్‌ఫోలియో నిర్వహించడానికి అందరికీ తగినంత పరిఙ్ఞానం ఉండదు. కాబట్టి డైరెక్ట్ ప్లాను, దాన్ని సులభంగా నిర్వహించగల మదుపరుల కోసం ఉద్దేశించబడింది. అలా కాకపోతే, మ్యూచువల్‌ ఫండ్స్ గురించి తగినంత పరిఙ్ఞానం లేనివారు డిస్టిబ్యూటర్ ద్వారా పెట్టుబడి పెట్టడం మంచిది.

407
402

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?