పెట్టుబడి పెట్టేందుకు సరైన రకం ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోవడం ఎలా?

పెట్టుబడి పెట్టేందుకు సరైన రకం ఈక్విటీ ఫండ్‌ను ఎంచుకోవడం ఎలా? zoom-icon

మీ పెట్టుబడి పోర్ట్ఫోలియో కోసం ఒక ఈక్విటీ ఫండ్ ఎంచుకోవడం అనేది దుస్తులు ఎంచుకోవడం లాంటిది, అయితే ఇందులో నిర్ణయం తీసుకునే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా  ఉంటుంది. మామూలు మాటల్లో చెప్పాలంటే మీకు ఒక షర్ట్ లేదా డ్రెస్ ఎలా ఫిట్ అవుతుంది, ఎంత సౌకర్యవంతంగా ఉంటుంది, ఇది అనుకున్న ఉద్దేశం లేదా సందర్భానికి అనుకూలంగా ఉందా అన్నది ఎంత సునిశితంగా ఎలా పరిశీలిస్తారో, అలాగే మీ పోర్ట్ఫోలియో కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవడానికి కూడా అలాంటి విధానాన్నే అనుసరించాలి.

మీరు ఒక ఈక్విటీ ఫండ్ పెట్టుబడి కోసం షాపింగ్ చేయడానికి వెళ్లే ముందు, మీరు మీ ప్రస్తుత పెట్టుబడి పోర్ట్ఫోలియోను పరిశీలించాలి. మీ వార్డ్రోబ్లో ఎలాంటి బట్టలు ఉన్నాయి, ఎలాంటివి లేవు అని ఎలా చూస్తారో అలాగే ఏ రకమైన పెట్టుబడులు ప్రస్తుతం మీ దగ్గర ఉన్నాయి? మీకు ఇప్పటికే కొన్ని ఈక్విటీ ఫండ్ పెట్టుబడులు ఉండవచ్చు లేదా ఒక అసెట్ క్లాస్గా మీకు ఈక్విటీలో అసలు ప్రవేశమే లేకుండా ఉండవచ్చు. కాబట్టి మీరు తరువాత ఎంచుకోబోయే ఈక్విటీ మీ మొత్తం పెట్టుబడి పోర్ట్ఫోలియోలోని ప్రస్తుత ఖాళీని పూర్తి చేయాలి. ఉదాహరణకు, మీరు ఇప్పటికే డైవర్సిఫైడ్ ఫండ్లో పెట్టుబడి పెట్టి ఉంటే, మీ రిస్క్ ప్రాధాన్యత మరియు పెట్టుబడి లక్ష్యానికి తగిన మల్టీక్యాప్ లేదా మిడ్-క్యాప్ లాంటి వేరే రకం ఈక్విటీ ఫండ్ పరిశీలించవచ్చు. మీ లక్ష్యం పన్ను ఆదా చేయడం అయి ఉండి, అలాంటి ఫండ్ మీ పోర్ట్ఫోలియోలో లేకుంటే, ఇది ఒక టాక్స్ సేవింగ్ ఫండ్ కూడా కావచ్చు. మీరు వైవిధ్యీకరణ ద్వారా మీ అసెట్ క్లాస్ రిస్క్ను వివిధ రకాల ఫండ్లలో విస్తరించాల్సి ఉంటుంది.

తరువాత పెట్టుబడి లక్ష్యం, రంగం మరియు స్టాక్ హోల్డింగ్ విషయంలో పోర్ట్ఫోలియో, ఫండ్ మేనేజర్లు, చరిత్ర, రిస్క్ ప్రమాణాలు, ఖర్చు నిష్పత్తి మొదలైన విషయాలను బట్టి ఫండ్ ఎలా అనిపిస్తున్నదో చూడాలి. ఇది మీరు కొనాలనుకునే డ్రెస్ స్టైల్, రంగు, బట్ట మరియు ఫినిష్ కోసం ఎలా చూస్తారో అలాగే ఉంటుంది. తర్వాత మీరు ఎంచుకున్న డ్రెస్ వివరాలు ఒక సరిపోయే డ్రెస్కు తగినట్లు ఉన్నాయా అని మదింపు చేస్తారు. ఫండ్ కూడా మీ మనసులో ఉన్న మీ అవసరం లేదా లక్ష్యానికి తప్పక సరిపోవాలి. ఈ దశలో, మీరు దాని బెంచ్మార్క్తో పోల్చి దాని పనితీరు ట్రాక్ రికార్డ్ చూడవచ్చు.

మున్ముందు ఒక ఫండ్ లో మీరు పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు, పై ఎంపికను క్రమపద్ధతిలో అనుసరించండి లేదా ఆర్థిక నిపుణుడి సలహాలు పొందండి.

420

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?