థీమ్యాటిక్ ఫండ్స్: అంటే ఏమిటి, అవి ఎలా పని చేస్తాయి, పెట్టుబడి ఎలా పెట్టాలి?

థీమ్యాటిక్ ఫండ్స్: అంటే ఏమిటి, అవి ఎలా పని చేస్తాయి, పెట్టుబడి ఎలా పెట్టాలి? zoom-icon

పర్యావరణం గురించి మీరు ఎంతగానో జాగ్రత్త తీసుకునే వారు అనుకుందాం, పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేసే ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడం మీ విలువలకు పూర్తిగా విరుద్ధంగా ఉండవచ్చు, కాబట్టి ఇప్పుడు మీకు, మీ నైతిక విలువలకు సరిపోయే పరిష్కారం మాత్రమే కాకుండా సంభావ్య రాబడులను సంపాదించి పెట్టే ఒక అవకాశాన్ని కూడా అందించే పరిష్కారం మీకు కావాలి.

నిర్వహణీయ పెట్టుబడుల ప్రపంచానికి స్వాగతం. నిర్దిష్టమైన పర్యావరణ సూత్రాలకు కట్టుబడి ఉండే కంపెనీలు మాత్రమే మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో చేర్చబడే లాగా నిర్ధారించుకునే ఒక ప్రత్యేకమైన ఫండ్ ఇది. సుస్థిరత, పరిరక్షణ మరియు హరిత భవిష్యత్తును ప్రాధాన్యతగా కొనసాగే వ్యాపారాలను జాగ్రత్తగా ఎంచుకుని వాటిలో ఈ ఫండ్లు పెట్టుబడి పెడతాయి. ప్రవేశపెడుతున్నాము, ESG ఫండ్స్, E–పర్యావరణం (ఎన్విరాన్మెంట్), S-సామాజికం (సోషల్), G-పాలన(గవర్నెన్స్)

స్వచ్ఛమైన ఎనర్జీ, వ్యర్థాల తగ్గింపు మరియు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతగా గల కంపెనీలకు ఒక వేదికను పర్యావరణ సంబంధిత విభాగం సిద్దం చేస్తుంది. న్యాయమైన కార్మిక విధానాలు, మానవహక్కులు మరియు కమ్యూనిటీ అభివృద్ధి ప్రాధాన్యతగా కొనసాగే వ్యాపారాల మీద సామాజిక విభాగం దృష్టి పెడుతుంది. పారదర్శక నాయకత్వం, నైతిక విలువలతో కూడిన నిర్ణయాలు మరియు బోర్డు వైవిధ్యతల సమ్మేళనాన్ని పాలక వ్యవస్థ నిర్ధారించుకుంటుంది.

పర్యావరణం, సామాజిక బాధ్యత మరియు నైతిక పాలనకు విలువను ఇచ్చే కంపెనీల మీద దృష్టి సారించే ఒక నిర్దిష్టమైన అంశాలకు ESG ఫండ్స్ ప్రాధాన్యతను ఇస్తాయి. సరళంగా చెప్పాలంటే, పైన పేర్కొన్న కీలకమైన అంశాల మీద ప్రత్యేకంగా దృష్టిసారించే వ్యాపారాలను ఎంచుకొని వాటిపై పెట్టుబడి పెట్టేందుకు ఈ ఫండ్స్ రూపొందించబడ్డాయి.

అయితే థీమ్యాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి?

థీమ్యాటిక్ ఫండ్స్ అనేవి మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో ఒక రకం. ఇవి స్వచ్ఛమైన ఎనర్జీ లేదా సాంకేతికత వంటి నిర్దిష్టమైన థీమ్స్ లేదా ఫండ్స్ మీద దృష్టిసారిస్తాయి. ఈ ఫండ్స్ వృద్ధి అవకాశాల నుండి లబ్ధి పొందేందుకు మరియు మదుపరులకు రాబడులను తెచ్చి పెట్టేందుకు నిర్దిష్ట థీమ్‌కు సంబంధించిన కంపెనీలలో పెట్టుబడి పెడతాయి. మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లు దృష్టి సారించే ఐదు విస్తారమైన థీమ్స్ : డివిడెంట్ అందించేవి, PSU, MNC, ఎనర్జీ మరియు వినియోగం. తయారీ, క్వాంట్, కమోడిటీస్, ఎగుమతులు, సర్వీసెస్ మరియు రవాణా వంటి ఎన్నో చిన్న థీమ్స్లో ఒకటి లేదా రెండు ఫండ్స్ ఉండవచ్చు.

థీమ్యాటిక్ ఫండ్స్ చురుకుగా నిర్వహించబడతాయి మరియు అధిక వృద్ధి కలిగిన అవకాశాల సంభావ్యతతో మరియు తమ విలువలు లేదా నమ్మకాలకు అనుగుణంగా మరియు అధిక రిస్క్తో అనుగుణ్యత కొరకు లక్షిత థీమ్ గురించి అవగాహనను పొందే అవకాశాన్ని మీ లాంటి పెట్టుబడిదారులకు అందించడమే వీటి లక్ష్యం. అయితే థీమ్యాటిక్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం వలన రిస్కులు మరియు సంభావ్య ప్రతిఫలాలను జాగ్రత్తగా మీరు మదింపు చేసుకోవాలి. ఈ ప్రొడక్ట్ మీకు సరిపోతుందా అనే సందేహం మీకు ఉంటే, మీ ఆర్థిక సలహాదారును మీరు సంప్రదించాలి.

ఈ ఫండ్స్ ఎంతో అస్థిరంగా ఉంటాయి మరియు వాటి పనితీరును ప్రభావితం చేసే బహిర్గత కారకాలు లేదా రిస్క్ తీవ్రతపై ఆధారపడి మెరుగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోవచ్చు.

థీమ్యాటిక్ పెట్టుబడులు ఎలా పని చేస్తాయి?

ఒక నిర్దిష్టమైన థీమ్ లేదా ట్రెండ్ కు అనుసంధానమైన కంపెనీలో థీమ్యాటిక్ పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది, నిర్దిష్ట రంగాలు లేదా ట్రెండ్లు కాలక్రమేణ మెరుగ్గా పెర్ఫార్మ్ చేస్తాయి అన్నది థీమ్యాటిక్ పెట్టుబడుల వెనక ఉన్న భావన మరియు ఈ థీమ్ؚలకు సంబంధించిన కంపెనీలో పెట్టుబడి పెట్టడం వలన అత్యధిక రాబడులను మీరు పొందవచ్చు.

థీమ్యాటిక్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వలన ప్రయోజనాలు

థీమ్యాటిక్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వలన కొన్ని సంభావ్య ప్రయోజనాలు

  1. అధిక-వృద్ధి గల రంగాలకు బహిర్గతం: భవిష్యతులో గణనీయమైన వృద్ధిని సాదించగల ఆర్థిక వృద్ధి గల రంగాల మీద అవగాహనను థీమ్యాటిక్ ఫండ్స్ మీకు అందిస్తాయి. ఉదాహరణకు, పునరుత్పాదక ఎనర్జీ కంపెనీలలో పెట్టుబడి పెట్టే థీమ్యాటిక్ ఫండ్ ద్వారా స్వచ్ఛమైన ఎనర్జీ కొరకు పెరుగుతున్న డిమాండ్ నుండి ప్రయోజనాన్ని పొందవచ్చు.
  2. వైవిధ్యీకరణ: థీమ్యాటిక్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వలన మదుపరులకు వైవిధ్యీకరణ ప్రయోజనాలు అందవచ్చు. రిస్క్‌ను విస్తరింపజేసి, ఒకే కంపెనీ లేదా రంగంలో కేంద్రీకరణను తగ్గించడంలో సహాయపడగల ఒక నిర్దిష్ట థీమ్ؚకు సంబంధించిన కంపెనీల పోర్ట్‌ఫోలియోలో ఈ ఫండ్స్ సాధారణంగా పెట్టుబడి పెడతాయి.
  3. వ్యక్తిగత విలువలతో సమలేఖనం: థీమాటిక్ ఫండ్స్ మదుపుదారుల విలువలు లేదా విశ్వాసాలకు అనుగుణంగా థీమ్యాటిక్ ఫండ్స్ ఉండవచ్చు. ఉదాహరణకు సామాజిక ప్రభావం మీద దృష్టి సారించే కంపెనీలో పెట్టుబడి పెట్టే ఒక థీమ్యాటిక్ ఫండ్ సామాజిక బాధ్యతను ప్రాధాన్యతగా కలిగిన ఒక మదుపుదారునితో అనుసంథానం కాగలదు.
  4. దీర్ఘకాల రాబడుల సంభావ్యత: వృద్ధి చెందుతున్ననిర్దిష్ట పరిశ్రమ లేదా రంగానికి బహిర్గతమయ్యే ఫండ్స్, ఆయా రంగం దీర్ఘకాలంలో మెరుగ్గా పెర్ఫార్మ్ చేసినట్లయితే, విస్తృత మార్కెట్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేయవచ్చు. అయితే, మదుపరులు పెట్టుబడి పెట్టడానికి ముందు, తమ రిస్క్ సామర్ధ్యాన్ని పరిగణించాలి మరియు స్కీం సంబంధిత పత్రాలను జాగ్రత్తగా చదవాలి. అయితే, తాము పెట్టుబడి పెట్టిన థీమ్ ఊహించిన దాని కంటే భిన్నంగా పెర్ఫార్మ్ చేసినట్లయితే, థీమాటిక్ ఫండ్స్ మెరుగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోవచ్చు అని గమనించాలి. కాబట్టి థీమ్యాటిక్ ఫండ్స్, మీరు ఊహించిన రాబడులను ఎల్లప్పుడూ ఇవ్వలేకపోవచ్చు.

థీమ్యాటిక్ ఫండ్స్ తో కూడుకున్న రిస్కులు

థీమ్యాటిక్ ఫండ్స్ అనుభవం ఉన్న మదుపరులకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుండగా, అవి అందరికీ అనుకూలమైనవి కావు. థీమ్యాటిక్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే ముందు పరిగణించవలసిన కొన్ని రిస్కులు:

1. రిస్క్ తీవ్రత

థీమ్యాటిక్ ఫండ్స్ అనేవి ఒక నిర్దిష్టమైన రంగం లేదా థీమ్ؚలో పెట్టుబడి పెడతాయి. అంటే అవి తీవ్రమైన రిస్కుకు బహిర్గతమై ఉంటాయని అర్ధం. థీమ్ మెరుగ్గా పెర్ఫార్మ్ చేయకపోయినా లేదా నియంత్రణ మార్పులు ఎదుర్కున్నా, ఫండ్ రాబడుల మీద గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉండవచ్చు.

2. అస్థిరత

వివిధీకరించిన ఫండ్స్ కంటే థీమాటిక్ ఫండ్స్ అనేవి నిర్దిష్ట రంగం/థీమ్ؚకు తదేకంగా బహిర్గతమై ఉండడం వలన ఎంతో అస్థిరంగా ఉంటాయి. ఈ అస్థిరతలు రాబడులలో గణనీయమైన హెచ్చుతగ్గులకు దారితీయవచ్చు, తద్వారా రిస్కును కొంతవరకు మాత్రమే తట్టుకోగల మదుపుదారులకు అనుకూలమైనవి కావు.

3. లిక్విడిటీ రిస్కు

కొన్ని థీమ్యాటిక్ ఫండ్స్, తగినంత లిక్విడిటీ కలిగి ఉండని, స్మాల్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ స్టాక్స్ లో పెట్టుబడి పెడతాయి. మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు లేదా అనుకూలంగా లేని మార్కెట్ పరిస్థితులలో పెట్టుబడి నుండి నిష్క్రమించేందుకు అది సవాలుగా మారవచ్చు.

4. పెర్ఫార్మెన్స్ రిస్క్

థీమ్యాటిక్ ఫండ్స్ అధిక రాబడులను అందించవచ్చు, అయితే విస్తృత మార్కెట్లో లేదా వైవిధ్యీకరించబడిన ఫండ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తాయన్న గ్యారెంటీ ఉండదు. థీమ్యాటిక్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు, సదరు రంగం/థీమ్ గురించి మరియు తత్సంబంధ కంపెనీల పెర్ఫార్మెన్స్ గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండడం అవసరం.

అవగాహనాపూర్వక పెట్టుబడి నిర్ణయాన్ని తీసుకునే క్రమంలో, ప్రత్యేకించి థీమ్యాటిక్ ఫండ్స్ విషయంలో, ఫండ్ మరియు ఆఫరింగ్ పత్రాలను చదవడం ముఖ్యం. ఈ పత్రాలలోని రిస్క్-ఓ-మీటర్ ఇతర ఫండ్స్ తో పోలిస్తే స్కీం యొక్క రిస్క్ స్థాయిని విజువల్ గా చూపిస్తుంది. అదనంగా, సంబంధిత బెంచ్ మార్కులతో లేదా అదే వర్గం లోని ఇతర ఫండ్స్ యొక్క సగటు రిస్క్‌తో ఫండ్ యొక్క రిస్క్ మదింపు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.

సారాంశం

అథిక వృద్ధి కలిగిన రంగాలపై అవగాహనను, వైవిధ్యీకరణ ప్రయోజనాలను, వ్యక్తిగత విలువలతో సమలేఖనాన్ని, క్రియాశీల నిర్వహణను మరియు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసే సంభావ్యతను మదుపరులకు అందించే సంభావ్యత థీమ్యాటిక్ ఫండ్స్ కు ఉంటుంది. అయితే, థీమ్యాటిక్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు రిస్కులను మరియు సంభావ్య రివార్డులను జాగ్రత్తగా మదింపు చేయాలి. ఎటువంటి పెట్టుబడితోనైనా ఉండే విధంగానే, మీరు మీ పరిశోధనను తప్పకుండా చేసి, పెట్టుబడి వ్యూహాన్ని, ట్రాక్ రికార్డును, మరియు రుసుము అర్ధం చేసుకుని, మీ పెట్టుబడి లక్ష్యాలు, రిస్కును తట్టుకునే స్థాయి ఆధారంగా ఒక అవగాహనపూర్వక నిర్ణయాన్ని తీసుకోవాలి.

డిస్క్లైమర్

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

284

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?