మిడ్-టర్మ్ పెట్టుబడి కొరకు ఏ మ్యూచువల్ ఫండ్ నేను ఎంచుకోవాలి?

మిడ్-టర్మ్ పెట్టుబడి కొరకు ఏ మ్యూచువల్ ఫండ్ నేను ఎంచుకోవాలి?

సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలలో 4-6 సంవత్సరాలు మీడియం టర్మ్‌గా పరిగణించబడుతుంది కావున క్యాపిటల్ అప్రిసియేషన్ ఇక్కడ మీ ఉద్దేశ్యంగా ఉండాలి. కార్పోరేట్ బాండ్ ఫండ్స్ మరియు హైబ్రిడ్ ఫండ్స్ క్యాపిటల్ అప్రిసియేషన్ కొరకు ఉత్తమంగా సరిపోతాయి ఎందుకంటే ఈక్విటీ ఫండ్స్ తో పోల్చినప్పుడు అవి తక్కువ వోలటైల్ ఈక్విటీ ఫండ్స్ లాంగ్-టర్మ్‌లొ వెల్త్ తయారీకి ఆదర్శమైనవి. కార్పరేట్ బాండ్ ఫండ్స్ 3-5 సంవత్సరాల సగటు మెచ్యూరిటీతో హై క్వాలిటీ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి, వడ్డీ రేటు మార్పులకు తక్కువ సెన్సిటివ్‌గా ఉంటాయి. హైబ్రిడ్ ఫండ్స్ కొంత ఈక్విటీ ఎక్స్పోజర్‌తో డెబిట్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తాయి అలా కొంత క్యాపిటల్ అప్రిసియేషన్‌తో బాటు సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్ ఎంపికను అందిస్తాయి.

మీడియం-టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ల కొరకు ఫండ్స్‌ను మూల్యాంకనం చేస్తున్నప్పుడు, ఫండ్ లాంగ్-టర్మ్ పనితీరు కొరకు 3-5 సంవత్సరాలు కన్న ఎక్కువ వెనుకకు చూడండి. మార్కెట్ సైకిల్లో ఇది స్థిరమైన పనితీరు కలిగి ఉందేమో చూడండి. చాలా ఫండ్స్ సెక్యులర్ బుల్ రన్‌లో అంటే మార్కెట్లు అప్‌వర్డ్‌ ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు బాగా పని చేస్తాయి, కానీ ఏదైతే మార్కెట్ డౌన్‌టర్న్‌లో కూడా చక్కని రిటర్ను ఇస్తుందో ఆ ఫండ్ కొంత కాలానికి స్థిరమైన రిటర్నులను ప్రదర్శిస్తుంది. మీరు 3-5 సంవత్సరాలకు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు మరియు మార్కెట్ ఈ సమయంలో మొండిగా ఉంటే, మీరు స్థిరమైన పనితీరు గల వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మీరు ప్రయోజనం పొందగలరు. మంచి పేరున్న ఒక విశ్వసనీయ ఫండ్ హౌస్ నుండి ఒక ఫండ్ ఎంచుకోండి లేదా సరైన ఫండ్ ఎంచుకునేందుకు ఒక ఆర్థిక నిపుణుడి నుండి సలహాను పొందండి.

420

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?