అన్ని పెట్టుబడులలో పెట్టుబడి పెడుతున్నప్పుడు పొరపాటు చేయడం సాధారణమే, మ్యూచువల్ ఫండ్స్ దీనికి అతీతం కాదు.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడంలో కొన్ని సామాన్య పొరపాట్లు :
- ఉత్పత్తిని అర్థం చేసుకోకుండా పెట్టుబడి పెట్టడం: ఉదాహరణకు, ఈక్విటీ ఫండ్స్ దీర్ఘ కాలానికి ఉన్నాయి, కానీ ఇన్వెస్టర్లు తక్కువ కాలంలో సులువైన రిటర్నుల కొరకు చూస్తారు.
- రిస్క్ కారకాలు తెలియకుండా ఇన్వెస్ట్ చేయడం: అన్ని మ్యూచువల్ ఫండ్ స్కీములకు నిర్దిష్ట రిస్క్ కారకాలు ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ముందు ఇన్వెస్టర్లు వాటిని అర్థం చేసుకోవలసి ఉంటుంది.
- సరియైన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయకపోవడం : కొన్నిసార్లు వ్యక్తులు యాదృచ్ఛికంగా, ఒక లక్ష్యం లేదా ప్రణాళిక లేకుండా ఇన్వెస్ట్ చేస్తారు. అట్టి సందర్భాలలో, మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం కోరుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు.
- చాలా ముందుగా రిడీమ్ చేసుకోవడం: ఇన్వెస్టర్లు కొన్నిసార్లు సహనం కోల్పోతారు లేదా కోరుకున్న రిటర్ను రేటు అందించడానికి పెట్టుబడికి కావలసిన సమయం ఇవ్వరు, అలా గడువుకు ముందుగానే రిడీం చేస్తారు.
- మందలో చేరడం: చాలా తరచుగా, ఇన్వెస్టర్లు తమ స్వంత నిర్ణయం తీసుకొరు, 'మార్కెట్' లేక 'మీడియా' లొ వినబడుతున్న వాదన పై మొగ్గు చూపి తప్పుడు ఎంపిక చేస్తారు.
- ప్రణాళిక లేకుండా ఇన్వెస్ట్ చేయడం: బహుశా ఇది అతిపెద్ద పొరపాటు కావచ్చు. పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి కూడా ప్రణాళిక లేదా లక్ష్యం ఉండాలి.
407