మ్యూచువల్‌ ఫండ్స్ నుండి నేను డబ్బుని ఎంత త్వరగా తీసుకోగలను?

మ్యూచువల్‌ ఫండ్స్ నుండి నేను డబ్బుని ఎంత త్వరగా తీసుకోగలను?

మ్యూచువల్‌ ఫండ్స్ అత్యంత లిక్విడ్ ఆస్తులలో ఒకటి, అంటే నగదుగా మార్చుకోవడానికి అత్యంత సులువైన వాటిలో ఒకటి. ఆఫ్‌లైన్ పద్ధతి ద్వారా ఫండ్స్ రీడిం చేసుకోవడానికి వీలుగా, యూనిట్ హోల్డర్ సంతకం చేసిన రిడెంషన్ రిక్వెస్టుని ఎఎమ్‌సిలకి లేదా నియమిత కార్యాలయం రిజిస్ట్రార్‌లకు సబ్మిట్ చేయాలి. ఫారంలో యూనిట్ హోల్డర్ పేరు, ఫోలియో నెంబర్, స్కీము పేరు మరియు ఎన్ని యునిట్లు రీడిం చేసుకోవాలో లాంటి వివరాలు కావాలి. రిడెంషన్ నుండి ప్రొసీడ్లు మొదటి పేరుతో యూనిట్ హోల్డర్ నమోదిత బ్యాంకు అకౌంటులోకి క్రెడిట్ చేయబడతాయి.

మ్యుచువల్ ఫండ్స్ సంబంధిత ఫండ్ యొక్క వెబ్‌సైట్ పైన కూడా కొనుగోలు మరియు అమ్మకం చేయవచ్చు. మీరు కోరుకున్న మ్యూచువల్‌ ఫండ్ ‘ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్’ పేజీలో లాగ్-ఆన్ అయి, మీ ఫోలియో నంబర్ మరియు/లేదా పిఎఎన్ ఉపయోగించి లాగిన్ అయి, మీరు రీడించేసుకోవాలనుకున్న స్కీముని మరియు యూనిట్ల సంఖ్య (లేదా మొత్తాన్ని ఎన్నుకుని, మీ లావాదేవీని ధృవీకరిస్తే చాలు.

అదనంగా, సిఎఎమ్ఎస్ (కంప్యూటర్ ఏజ్ మేనేజిమెంట్ సర్వీసెస్ ప్రై. లిమిటెడ్), కర్వీ మొదలగులాంటి రిజిస్ట్రార్లు చాలా ఎఎమ్‌సిల నుండి కొన్ని మ్యుచువల్ ఫండ్స్ రిడీం చేసుకునే ఎంపికను అందిస్తాయి. మీరు ఫారంని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా సమీప కార్యాలయాన్ని సందర్శించగలరు. ఈ ఏజెన్సీలు అన్ని ఎఎమ్‌సిల కొరకు సేవలను అందించకపోవచ్చు అని దయచేసి గమనించండి.

405

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?