రిటైర్ అయిన వారికి వారి సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్స్ బ్యాంక్ ఎఫ్డిలు, పిపిఎఫ్లు, గోల్డ్, రియల్ ఎస్టేట్, ఇన్స్యూరెన్స్, పెన్షన్ ప్లానులు మొదలగువాటిలో లాక్ అప్ అయి ఉంటాయి. ఈ ఎంపికలలో చాలా వరకు వెంటనే నగదుగా మార్చడం కష్టము. వైద్య లేదా అత్యవసర పరిస్థితులలో దీనివలన అనవసరమైన ఒత్తిడికి దారితీయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ చాలా-అవసరమైన లిక్విడిటీని రిటైర్ అయిన వారికి అందిస్తాయి, ఎందుకంటే అవి సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు మరియు మంచి పోస్ట్ టాక్స్ రిటర్నులు అందిస్తాయి.
చాలా మంది రిటైర్ అయిన వారు మ్యూచువల్ ఫండ్స్ ఒడుదుడుకులు లేదా రిటర్నులలో హెచ్చు తగ్గుల భయంతో ఉంటారు మరియు వాటి నుండి దూరంగా ఉంటారు. వారు తమ రిటైర్మెంట్ కార్పస్‌లో కొంత డెబిట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉంచాలి మరియు సిస్టెమాటిక్ విత్డ్రా ప్లాన్ (ఎస్‌డబ్ల్యుపి)ని తీసుకోవాలి. అట్టి ఇన్వెస్ట్మెంట్ నుండి వారు రెగ్యులర్ నెలవారీ ఆదాయం పొందడానికి ఇది సహాయపడుతుంది. డెబిట్ ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ కన్నా సురక్షితమైనవి ఎందుకంటే అవి బ్యాంకులు, కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు మరియు మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లు (బ్యాంకు సిడిలు, టి-బిల్స్, కమర్షియల్ పేపర్స్) లో ఇన్వెస్ట్ చేస్తాయి.
డెబిట్ ఫండ్స్‌లో ఎఫ్‌డిలతో పోల్చితే ఎస్‌డబ్ల్యుపి సమర్థవంతమైన రిటర్నులను అందజేస్తుంది. ఎఫ్‌డి/పెన్షన్ ప్లాన్ నుండి ఆదాయం ఎస్‌డబ్ల్యుపి క్రింద విత్‌డ్రాయల్స్‌తో పోల్చితే అధిక సమర్థవంతమైన రేట్ల వద్ద టాక్స్ చేయబడుతుంది. పెన్షన్ ప్లాన్ లాగా కాకుండా మీ అవసరాన్ని బట్టి మీరు సులువుగా ఎస్‌డబ్ల్యుపి ఆపవచ్చు లేదా విత్డ్రాయల్ అమౌంటుని మార్చవచ్చు. అలా రిటైర్ అయిన వారు మ్యూచువల్ ఫండ్స్ ని వారి ఆర్థిక ప్లాన్లలో చేర్చాలి.