రుపీ కాస్ట్ ఆవరేజింగ్ అంటే ఏమిటి?

Video

నగరంలో మీరు డ్రైవ్ చేసినప్పుడు, కొన్నిసార్లు ఖాళీ రోడ్డు కనిపిస్తుంది, అప్పుడు మీరు గంటకు 80 కిమీ. వేగంతో వెళ్తారు అదే కొన్నిసార్లు ట్రాఫిక్ లేదా స్పీడ్ బ్రేకర్ల కారణంగా మీరు గంటకు 20 కిమీ వేగానికి తగ్గవలసి వస్తుంది. అంతిమంగా, ఎన్నిసార్లు మీరు స్పీడ్ తగ్గించవలసి లేదా పెంచవలసి వచ్చింది అనేదానిపై ఆధారపడి, మీరు గంటకు 45 కిమీ లేదా గంటకు 55 కిమీ సగటు వేగాన్ని సాధిస్తారు.

నగరంలో మరీ వేగం లేదా మరీ నెమ్మది కాకుండా ఉండే మీ సగటు వేగం లాగానే, SIPల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం అనేది మార్కెట్‌లో ఉన్న ఎత్తులు మరియు పల్లాలను సులువుగా అధిగమించడానికి సహాయపడుతుంది. సరైన మార్కెట్ సమయాన్ని ఎంచుకోవడం అసాధ్యం అని మనకందరికీ తెలుసు. కాబట్టి తన పెట్టుబడులు కొనడానికి/అమ్మడానికి మార్కెట్ పెరుగుదల/తగ్గుదలను ఖచ్చితమైన సమయాన్ని పెట్టుబడిదారు ఎప్పుడూ కనుగొనలేరు. అలాంటి పరిస్థితిలో, పెట్టుబడి పెట్టడంలో క్రమశిక్షణాయుతమైన విధానం మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావాన్ని బాగా నియంత్రించడానికి పెట్టుబడిదారుకు సహాయపడుతుంది. 

మీరు దీర్ఘ కాలం పాటు ఒక మ్యూచువల్ ఫండ్‌లో స్థిరమైన మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టినప్పుడు, మీ పెట్టుబడులపై మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం అంతగా ఉండదు. ఎందుకంటే మార్కెట్లు పడిపోయినప్పుడు అదే మొత్తంతో మీరు ఎక్కువ యూనిట్లు కొంటారు మరియు మార్కెట్లు పెరిగినప్పుడు అదే మొత్తంతో ఎక్కువ యూనిట్లు కొంటారు. ఆవిధంగా, ఈ సమయంలో మార్కెట్లు ఏవైపుకు కదిలినా, మీ చేతిలో ఉన్న మొత్తం యూనిట్ల సగటు యూనిట్ ధర కాలక్రమేణా తగ్గుతూ ఉంటుంది. ఇదే SIPల రుపీ కాస్ట్ ఆవరేజింగ్ సారాంశం.

మీరు ఎక్కువ కాలం అంటే ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం మీ SIP పెట్టుబడులు కొనసాగిస్తే, మార్కెట్ పెరిగితే, యూనిట్ల సగటు ధర అప్పుడు ఉన్న NAV కంటే తక్కువ ఉంటుంది. 

SIPలు కాంపౌండింగ్ శక్తిని అందించడమే కాకుండా, రుపీ కాస్ట్ ఆవరేజింగ్ ప్రయోజనాలను కూడా అందిస్తాయి. సుదీర్ఘ హోల్డింగ్ సమయంలో కాంపౌండింగ్ శక్తి ఇంకా ఎక్కువ ప్రభావవంతం అవుతుంది, ఎందుకంటే రెట్టింపు అవ్వడానికి మీ పెట్టుబడులకు ఎక్కువ సమయం దొరుకుతుంది, ఇది మీ జేబుకు ఎక్కువ భారం పడకుండా సంపద పోగుచేయడంలో సహాయపడుతుంది. 

402

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?