SIPలో రెండు సంవత్సరాల ఆలస్యానికి మీరు కోల్పోయేది ఎంత

SIPలో రెండు సంవత్సరాల ఆలస్యానికి మీరు కోల్పోయేది ఎంత zoom-icon

స్టాక్ మార్కెట్‌లో, ప్రత్యేకించి మీకు అంతగా అనుభవం లేకపోతే, పెట్టుబడి పెట్టడం భయం కలిగించవచ్చు. అయితే, ప్రయత్నించి, పరీక్షించిన పెట్టుబడి వ్యూహం ఒకటి ఉంది, అది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం సులభతరం చేయడమే కాకుండా మీరు దీర్ఘ-కాలంలో సంపదను సృష్టించడంలో మీకు సహాయపడుతుంది : అదే SIPలు లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్. 

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIPలు) క్రమవారీ కాలవ్యవధుల వద్ద మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక చిన్న మొత్తాన్ని మీరు పెట్టుబడి పెట్టేందుకు తోడ్పడతాయి. క్రమం తప్పకుండా చిన్న మొత్తంలో నగదును పెట్టుబడి పెట్టడం ద్వారా, మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో పవర్ అఫ్ కాంపౌండ్ ఉపయోగాన్ని మీరు అందుకునేలా SIPలు సహాయపడగలవు. 

ప్రతినెలా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి చేసే చిన్న మొత్తం, కాలక్రమేణ గుర్తించదగిన పెట్టుబడి పోర్ట్ఫోలియోలోకి వృద్ధి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అవాంతరాలు లేని, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానం కోసం చూసేవారికి SIPలు ఒక అద్భుతమైన పెట్టుబడి వికల్పం. ప్రొడక్ట్/స్కీం యొక్క అనుగుణ్యతకు సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, ఒక మ్యూచువల్ ఫండ్ అనుభవజ్ఞుడి నుండి మార్గదర్శనం పొందవలసిందిగా సూచించడమైనది.

తరచుగా, SIPలు లేదా మ్యూచువల్ ఫండ్స్ చాలా జఠిలమైనవి అనే భావనతో అందులో పెట్టుబడులు పెట్టడం గురించి అంతగా ఆసక్తి చూపించరు. అది పని చేసే తీరు వారికి అర్ధం కానందున, పెట్టుబడులు పెట్టడంలో సంకోచిస్తారు. 

అయితే, మీరు ఆలస్యంగా పెట్టుబడి పెట్టడం వలన భారీగా నష్టపోగలరు!. SIPలో మీరు నెలకు కేవలం రూ.1,000లు పెట్టుబడి పెట్టినా కూడా, రెండు సంవత్సరాలు ఆలస్యం అయితే, మీరు భారీగా నష్టపోతారు. 

నమ్మలేకపోతున్నారా? దీన్ని వివరంగా సంఖ్యల ద్వారా తెలుసుకుందాం! 

12% వార్షిక రాబడి అందించే ఒక ఈక్విటీ SIPలో 25 సంవత్సరాల వద్ద ₹1000 మీరు పెట్టుబడి చేద్దాం అనుకున్నారనుకోండి. అందులో మీరు 30 సంవత్సరాల పాటు పెట్టుబడి చేయడం కొనసాగించాలని ప్రణాళిక చేసుకున్నారు అనుకుందాం. కొన్ని అనివార్య కారణాల వలన, రెండు సంవత్సరాల తర్వాత మీరు ఈ ప్లాన్‌ను అమలు చేద్దామని నిర్ణయించుకున్నారు అనుకోండి. అప్పుడు పెట్టుబడి వ్యవధి 28 సంవత్సరాలు అవుతుంది. మీరు పొందగల సంభావ్య రాబడులను దిగువ పట్టిక విశదీకరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ రాబడులు రిస్కులకు లోబడి ఉంటాయన్నది గమనార్హం:
 

వివరాలు

25 సంవత్సరాల వద్ద ఆరంభిస్తే

27 సంవత్సరాల వద్ద ఆరంభిస్తే

పెట్టుబడి వ్యవధి

30

28

ప్రతి నెలా పెట్టుబడి చేసిన మొత్తం

Rs 1,000

Rs 1,000

పెట్టుబడి మీద ఆశించిన రాబడి

12%

12%

పెట్టుబడి చేసిన మొత్తం

Rs 3,60,000

Rs 3,36,000

రాబడులతో కూడిన మొత్తం మూలధనం

Rs 35,29,914

Rs 27,58,585

పెట్టుబడి జాప్యం ఖరీదు

-

Rs 7,71,329

* పైన పేర్కొన్న కాలిక్యులేషన్స్ వివరణాత్మక ప్రయోజనాల కొరకు మాత్రమే మరియు రిస్కులకు లోబడి ఉంటాయి.

దీర్ఘకాలం పాటు డెట్ ఫండ్‌లో SIP కష్టమే. బహుశా, ఒక హైబ్రిడ్ ఫండ్ పరిగణించవచ్చు.
ఇక్కడ గనక మీరు చూస్తే, కేవలం రెండు సంవత్సరాల ఆలస్యానికి మీరు ₹7,00,000 కంటే ఎక్కువ మొత్తాన్ని కోల్పోతారు. ఇప్పుడు, మీరు హైబ్రిడ్ ఫండ్‌లో 10% వార్షిక సగటు రాబడికి పెట్టుబడి పెట్టినప్పటికీ, పెట్టుబడిలో చేసే జాప్యం ఖరీదు లక్షలలో ఉంటుంది. 
 

వివరాలు

25 సంవత్సరాల వద్ద ఆరంభిస్తే

27 సంవత్సరాల ఆరంభిస్తే

పెట్టుబడి వ్యవధి

30

28

ప్రతి నెలా పెట్టుబడి చేసిన మొత్తం

Rs 1,000

Rs 1,000

పెట్టుబడి మీద ఆశించిన రాబడి

10%

10%

పెట్టుబడి చేసిన మొత్తం

Rs 3,60,000

Rs 3,36,000

రాబడులతో కూడిన మొత్తం మూలధనం

Rs 22,79,325

Rs 18,45,849

పెట్టుబడి జాప్యం ఖరీదు

-

Rs 4,33,476

* పైన పేర్కొన్న కాలిక్యులేషన్స్ వివరణాత్మక ప్రయోజనాల కొరకు మాత్రమే మరియు రిస్కులకు లోబడి ఉంటాయి.

పవర్ ఆఫ్ కాంపౌండింగ్

పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది పెట్టుబడుల వలన కలిగే ఒక ప్రయోజనం, అది మీరు పెట్టుబడి పెట్టిన అసలు మీద, అలాగే దానిపై వచ్చిన వడ్డీ మీద వడ్డీని మీకు అందిస్తుంది. అంటే, మీ ఆదాయం కాలక్రమేణా వర్ధమాన రేటులో వృద్ధి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఇది మీ పెట్టుబడి మీద గణనీయమైన రాబడులను సంపాదించడంలో మీకు సహాయపడవచ్చు.

మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే, కాంపౌండింగ్ ప్రభావం అంత శక్తివంతంగా ఉంటుంది, మీ ఆర్థిక లక్ష్యాలను మరింత సులభంగా చేరుకోవడంలో మీకు సహాయపడుతుంది. పై ఉదాహరణలను వివరిస్తున్నట్లుగా, కేవలం రెండు సంవత్సరాల వల్ల ఆలస్యం పెట్టుబడికి భారీగా ఖర్చు అవుతుంది.

అందుకే మీకు వీలైనంత త్వరగా పెట్టుబడి పెట్టడం ఆరంభించాలి. మీరు నెలకు కేవలం రూ.1,000 పెట్టుబడి పెట్టాలనుకున్న సరే, మీరు పెట్టుబడి పెట్టేందుకు ఒక మంచి మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవాలి.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం సులభం మరియు ఎటువంటి అవాతంరాలు ఉండవు. నెలవారీ పెట్టుబడుల గురించి చింతించకుండా మీరు మీ పెట్టుబడులను ఆటోమేట్ చేయవచ్చు.

చివరి మాట

ఆలస్యం అమృతం విషం అన్న నానుడి మనందరికీ తెలిసిందే. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టగలిగినా సరే, భవిష్యత్తులో ఆర్ధికంగా స్థిరపడేందుకు పెట్టుబడి పెట్టడం నేడే ఆరంభించండి.

డిస్క్లైమర్

AMFI వెబ్‌సైట్‌లో మ్యూచువల్ ఫండ్‌ల వివిధ వర్గాల గురించి ప్రచురించిన సమాచారం, ఒక ఆర్ధిక సంబంధిత ఉత్పాదక వర్గంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన ఏర్పరచేందుకు సమాచార సంబంధిత ప్రయోజనాల కోసం మాత్రమే కానీ విక్రయాల ప్రమోషన్ లేదా వ్యాపార అభ్యర్ధనల కోసం మాత్రం కాదు. 

బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గత మూలాలు, ఇతర విశ్వసనీయమైన తృతీయ వర్గపు మూలాల ఆధారంగా ఈ సమాచారం AMFI ద్వారా తయారుచేయబడింది. అయినప్పటికీ, అటువంటి సమాచార ఖచ్చితత్వానికి, దాని సంపూర్ణతకు AMFI ఎటువంటి హామీ ఇవ్వదు, లేదా అటువంటి సమాచారం మార్చబడదని వారంట్ ఇవ్వదు. 

ఇక్కడి సమాచారం, ప్రతి ఒక్క మదుపుదారుని ఉద్దేశ్యాలు, రిస్కు కాంక్షలు, లేదా ఆర్ధిక సంబంధిత అవసరాలు లేదా పరిస్థితులు లేదా ఇక్కడ విశదపరచిన మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తుల పొందికలను పరిగణనలోకి తీసుకోదు. తద్వారా, దీనికి సంబంధించి పెట్టుబడి సలహా కొరకు తమ తమ ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్/కన్సల్టెంట్/ట్యాక్స్ అడ్వైజర్ లను మదుపరులు సంప్రదించవలసిందిగా సూచించడమైనది. 

ఒక మ్యూచువల్ ఫండ్ స్కీం అనేది ఒక డిపాజిట్ ఉత్పత్తి కాదు, మరియు అది మ్యూచువల్ ఫండ్ లేదా దాని ఎఎంసికి లోబడి ఉండదు, లేదా వారి చేత హామీగానీ, రక్షణను గానీ అందించబడదు. సంబంధిత పెట్టుబడుల స్వభావం కారణంగా, ఒక మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తి రాబడులు లేదా సంభావ్య రాబడులు హామీ ఇవ్వబడవు. చూపించిన చారిత్రక పనితీరు సంపూర్ణంగా రెఫరెన్స్ ప్రయోజనాల కొరకు మాత్రమే గానీ భవిష్య ఫలితాలకు హామీ కాదు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

 

286

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?