గోల్డ్ ETF అంటే ఏమిటి, మరియు మీరు దానిలో ఎలా పెట్టుబడి పెట్టగలరు?

గోల్డ్ ETF వర్సెస్ ఫిజికల్ గోల్డ్ zoom-icon

గోల్డ్ ETF అనేది దేశీయ భౌతిక బంగారం ధరను ట్రాక్ చేసే లక్ష్యంతో ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్. ఇది ప్రస్తుత బంగారం ధరల ప్రకారం బంగారు కడ్డీలో పెట్టుబడి పెట్టే నిష్క్రియ పెట్టుబడి సాధనం. కాబట్టి, సరళంగా చెప్పాలంటే, గోల్డ్ ETFలు భౌతిక బంగారాన్ని సూచిస్తాయి (కాగితం లేదా డీమెటీరియలైజ్డ్ రూపంలో). 

1 యూనిట్ గోల్డ్ ETF = 1 గ్రాము బంగారం.

ఒక కంపెనీ యొక్క ఇతర స్టాక్ؚల విధంగానే గోల్డ్ ETFలను కూడా భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో ట్రేడ్ చేయవచ్చు . పెట్టుబడిదారులు స్టాక్ؚను ఎలా ట్రేడ్ చేస్తారో, అలాగే గోల్డ్ ETFలను కూడా ట్రేడింగ్ చేయవచ్చు.

గోల్డ్ ETFలు ప్రధానంగా NSE (నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్), BSE (బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్)లో జాబితా చేయబడి ట్రేడవుతాయి. వీటిని నగదు విభాగంలో ట్రేడింగ్ చేస్తారు మరియు మార్కెట్ ధరల వద్ద నిరంతరం కొనుగోలు చేయవచ్చు మరియు విక్రయించవచ్చు. 

గోల్డ్ ETFలను కొనుగోలు చేయడానికి నేరుగా స్టాక్ బ్రోకర్ ద్వారా డీమ్యాట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఆ తరువాత, షేర్లను కొనుగోలు చేసినట్లే, మీరు నేరుగా గోల్డ్ ETF యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. 

ఈ ప్రక్రియ ఇక్కడ వివరించబడింది:

  • స్టాక్ బ్రోకర్ని సంప్రదించి,ఆన్లైన్ ట్రేడింగ్ మరియు డీమ్యాట్ ఖాతాను తెరవండి. 
  • మీ ట్రేడింగ్ పోర్టల్ؚలో, అవసరమైన ఆధారాలతో ఖాతాకి లాగిన్ అవ్వండి. 
  • ఇప్పుడు మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న గోల్డ్ ETFలను ఎంచుకోండి. 
  • మీరు కోరుకున్న మొత్తంలో గోల్డ్ ETFలను కొనుగోలు చేసిన తర్వాత మీకు నిర్ధారణ సందేశం వస్తుంది. 
  • డీమ్యాట్ పద్ధతిలో గోల్డ్ ETFలలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడని పెట్టుబడిదారు ETFలలో పరోక్షంగా పెట్టుబడి పెట్టే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ؚలో కూడా పెట్టుబడి పెట్టవచ్చు. 
  • అంటే పెట్టుబడిదారు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నట్లు, కానీ వాటిమూల ఆస్తులు గోల్డ్ ETFలు అని అర్థం. 

 

డిస్క్లైమర్

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

286

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?