ఎలాంటి రిస్కు తీసుకోకుండా మంచి రాబడులు పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే మీ డబ్బును అసలు పెట్టుబడి కూడా పెట్టకుండా అలాంటి రాబడి పొందడం సాధ్యమేనా? మీరు మీ సేవిగ్స్ను పెట్టుబడి పెడుతుంటే, ద్రవ్యోల్బణం కంటే మెరుగైన రాబడి సంపాదించడానికి మీరు అలాంటి రిస్కు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. (మీ సేవిగ్స్ను ద్రవ్యోల్బణం ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి, ఇక్కడ ఈ వ్యాసం చదవండి) ఈ పెట్టుబడి పిల్లల చదువు, కొత్త ఇల్లు లేదా పదవీవిరమణ లాంటి మీ కొన్ని భవిష్యత్ లక్ష్యాల కోసం కావచ్చు. అయితే, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును, మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టగలిగినప్పటికీ, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్కులో పెడుతున్నట్లు మీరు ఆందోళన చెందవచ్చు. అది ఒక సరియైన సందేహం.
మ్యూచువల్ ఫండ్లలో రిస్కు ఉందనేది తెలుసు. అవి ఫిక్స్డ్ డిపాజిట్ల లాగా రాబడికి గ్యారెంటీ ఇవ్వవు. కాని అవి క్రికెట్ ఆట లాంటివి. భారత టీము పిఛ్లోకి వచ్చినప్పుడు, వారు మ్యాచ్ గెలుస్తారా అనేది కూడా మనకు తెలియదు. ఓడిపోయే పెద్ద రిస్కు ఉంది, అయితే గెలవడానికి పెద్ద అవకాశం కూడా ఉంది. మ్యాచ్ అడే రిస్కును టీము తీసుకోకపోతే, వారు విజయాన్ని రుచి చూడలేరు. మ్యూచువల్ ఫండ్ల విషయం కూడా అంతే. మీ మూలధనాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రిస్కు తీసుకోనంత వరకు, మీరు మ్యూచువల్ ఫండ్ల రెండవ కోణాన్ని అనుభవించలేరు, అంటే ఎఫ్డి, బంగారు కొనడం, రియల్ ఎస్టేట్ మొదలైన అత్యధిక ఇతర వికల్పాల కంటే ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేయబడిన అధిక రాబడిని సంపాదించే సంభావ్యతను అనుభవించలేరు.