డెబిట్ ఫండ్స్ అవి ఇన్వెస్ట్ చేసే సెక్యూరిటీస్ మరియు ఈ సెక్యూరిటీల మెచ్యూరిటీ (సమయ కాలం) విభిన్న రకాలుగా వర్గీకరించబడినాయి. డెట్ సెక్యూరిటీలలో కార్పొరేట్లు, బ్యాంకులు మరియు గవర్నమెంటు ద్వారా జారీ చేయబడిన బాండ్లు, పెద్ద కార్పొరేట్ల ద్వారా జారీ చేయబడిన డిబెంచర్లు, మనీ మార్కెట్ ఇన్స్ట్రమెంట్లు లాంటి కమర్షియల్ పేపర్స్ మరియు బ్యాంకు ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్లు (సిడిలు).
డెట్ ఫండ్స్ క్రింది విధంగా వర్గీకరించబడ్డాయి:
- ఓవర్ నైట్ ఫండ్స్ – 1- రోజు మెచ్యూరిటీ ఉండే పేపర్స్ (సెక్యూరిటీలు)లో ఇన్వెస్ట్ చేయండి
- లిక్విడ్ ఫండ్స్ – 90 రోజుల లోపు మెచ్యూర్ అయ్యే మనీ మార్కెట్ ఇన్‌స్ట్రమెంట్లలో ఇన్వెస్ట్ చేస్తాయి ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్- ఫ్లోటింగ్ రేట్ డెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తాయి
- అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ - 3-6 నెలలలో మెచ్యూర్ అయ్యే డెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తాయి
- లో డ్యూరేషన్ ఫండ్ – 6-12 నెలలలో మెచ్యూర్ అయ్యే సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తాయి
- మనీ మార్కెట్ ఫండ్స్ – 1 సంవత్సరం వరకు మెచ్యూర్ అయ్యే మనీ మార్కెట్ ఇన్‌స్ట్రమెంట్లలో ఇన్వెస్ట్ చేస్తాయి
- షార్ట్ డ్యూరేషన్ ఫండ్ – 1-3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తాయి
- మీడియం డ్యూరేషన్ ఫండ్ – 3-4 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తాయి
- మీడియం టు లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ – 4-7 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తాయి
- లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ – లాంగ్ మెచ్యూరిటీ డెట్ (7 సంవత్సరాలకు పైగా) లో ఇన్వెస్ట్ చేస్తాయి
- కార్పొరేట్ బాండ్ ఫండ్స్ – కార్పొరేట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి
- బ్యాంకింగ్ & పిఎస్‌యు ఫండ్స్ - బ్యాకులు, పిఎస్‌యులు, పిఎఫ్ఐల డెబిట్‌లలో ఇన్వెస్ట్ చేస్తాయి
- గిఫ్ట్ ఫండ్స్ – మారుతూ ఉండే మెచ్యూరిటీలు గల గవర్నమెంట్ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి
- స్థిరమైన 10 సంవత్సరాల వ్యవధితో గిఫ్ట్ ఫండ్ – 10 సంవత్సరాలతో జి-సెక్ ల లో ఇన్వెస్ట్ చేస్తాయి
- డైనమిక్ ఫండ్స్ – మెచ్యూరిటీలలో సెక్యూరిటీలలో డెట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాయి క్రెడిట్ ఫండ్స్ - అత్యధిక రేటింగులకు తక్కువగా క్రెడిట్ రిస్కు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి
408