మీరు దీర్ఘ కాలం పాటు ఒక మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే, మీరు సంపాదించే రాబడులకు కాంపౌండింగ్ ప్రభావం ఉంటుంది. అయితే, కొద్ది సంవత్సరాలు మీరు పెట్టుబడి పెట్టడాన్ని ఆలస్యం చేస్తే, మీరు రావల్సిన దానిలో ఎంతో నష్టపోతారు. మీరు జమ చేసిన మొత్తంతో పోల్చినప్పుడు కొద్ది సంవత్సరాల ముందుగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించి ఉంటే మీరు జమచేయగలిన మొత్తానికి మధ్య ఉన్న తేడాను ఈ కాంపౌండింగ్ ప్రభావం ఎక్కువ చేస్తుంది. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి mutualfundssahihai.com/te/what-age-should-one-start-investing పరిశీలించండి.
ఈ కాంపౌండింగ్ ప్రభావం దీర్ఘ-కాలంలో తన మ్యాజిక్ చూపిస్తుంది, ఎందుకంటే మీరు ఎంత ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే, మీ డబ్బు అంత ఎక్కువగా కాంపౌండ్ అవుతుంది. కాంపౌండింగ్ శక్తి భూతద్దం లాంటిది, దాని పెద్దగా చేసి చూపించే శక్తి సమయం గడిచే కొద్దీ విశేషంగా పెరుగుతుంది. మీ పెట్టుబడులను మీరు ఆలస్యం చేస్తే, అది SIP ద్వారా అయినా లేదా ఏకమొత్తంగా అయినా, మీరు తర్వాత పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టినా, ఉదాహరణకు మీ కంటే ఐదు సంవత్సరాలు ముందు ప్రారంభించిన వారికి సమానం కావడం సాధ్యం కాదు. SIP విషయానికి వస్తే, అతను/ఆమె మీరు పెట్టుబడి పెట్టేదాని కంటే సగమే పెట్టుబడి పెట్టవచ్చు, కానీ మీ పెట్టుబడులు ఇప్పటికీ వెనుకబడే ఉంటాయి. ఏకమొత్తం పెట్టుబడితో కూడా, కొద్ది సంవత్సరాల ఆలస్యం అంటే మీరు జమచేసిన సంపద, మీ కంటే కొద్ది సంవత్సరాలు ముందు పెట్టుబడి పెట్టిన వారికంటే తక్కువ ఉంటుంది. మీ పెట్టుబడి నిర్ణయంలో ఆలస్యం చేసినందుకు చెల్లించవలసిన పెద్ద మూల్యం అదే.
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ముందుగా ప్రారంభిస్తే, మీ పెట్టుబడి మొత్తం చిన్నది అయినప్పటికీ, మీరు 10 సంవత్సరాల తర్వాత ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన దానితో పోల్చితే, మీరు కొన్ని దశాబ్దాలలో చాలా ఎక్కువ సంపదను ప్రోగు చేసే అవకాశం ఉంది. ఇది కుందేలు తాబేలు కథ లాంటిది, మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆలస్యంగా ప్రారంభించడానికి బదులు, ముందుగా మెల్లగా మరియు స్థిరంగా ప్రారంభించిన పెట్టుబడులు, మీరు మీ లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోవడంలో సహాయపడతాయి.