డైరెక్ట్ ప్లాన్/ రెగ్యులర్ ప్లాన్ అంటే ఏమిటి?

డైరెక్ట్ ప్లాన్/ రెగ్యులర్ ప్లాన్ అంటే ఏమిటి?

అన్ని మ్యూచు‌వల్ ఫండ్ స్కీములు రెండు ప్లాన్లను - డైరెక్ట్ మరియు రెగ్యులర్‌లను అందిస్తాయి. డైరెక్ట్ ప్లానులో, లావాదేవీని జరిపించేందుకు ఎటువంటి డిస్ట్రిబ్యూటర్ లేని ఎఎమ్‌సితో ఇన్వెస్టర్‌ నేరుగా ఇన్వెస్ట్‌ చేయవలసి ఉంటుంది. రెగ్యులర్ ప్లానులో, డిస్ట్రిబ్యూటర్, బ్రోకర్ లేదా బ్యాంకర్ వంటి మధ్యవర్తి ద్వారా పెట్టుబడిదారు ఇన్వెస్ట్ చేస్తారు, ప్లానుకు ఛార్జ్ చేయబడే డిస్ట్రిబ్యూషన్ ఫీజు ఈ మధ్యవర్తికి చెల్లించబడుతుంది.

అందువలన, డైరెక్ట్ ప్లాన్ తక్కువ ఎక్స్పెన్స్ రేషియోని కలిగి ఉంటుంది, కాగా రెగ్యులర్ ప్లాన్ ట్రాన్సాక్షన్ కొరకు డిస్ట్రిబ్యూటరుకి చెల్లించే కమీషన్ నిమిత్తం స్వల్పంగా ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియోని కలిగి ఉంటుంది.

ఎమ్ఎఫ్ స్కీముని నిర్వహించడంలో ఖర్చులు మరియు వ్యయాలు అనివార్యం, ఫండ్ మేనేజ్‌మెంట్ ఖర్చులు, అమ్మకాలు మరియు డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు, కస్టోడియన్ మరియు రిజిస్ట్రార్ ఫీజు మొదలైనవి ఉంటాయి. అట్టి ఖర్చులు అన్నీ ఫండ్ వ్యయ నిష్పత్తిలో కవర్ చేయబడతాయి. అట్టి వ్యయాలు రెగ్యులేటర్ -సెబీ ద్వారా నిర్దేశించబడిన పరిమితుల లోపు ఉంటాయి.

అలా ఒక పెట్టుబడిదారు డైరెక్ట్ ప్లానులో డైరెక్టుగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఖర్చులలో పొదుపు వలన ఆమెకు మార్జినల్‌గా అధిక రిటర్ను రావచ్చు, కానీ మధ్యవర్తి యొక్క డిస్ట్రిబ్యూషన్ మరియు సంబంధిత సేవల కొరకు వినియోగించుకోలేకపోవచ్చు.

407
420

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?