డివిడెండ్ నుండి గ్రోత్ ఆప్షన్స్ కొరకు మారుతున్నప్పుడు ఇన్వెస్టర్లు పరిగణించాల్సినవి ఏవి?

డివిడెండ్ నుండి గ్రోత్ ఆప్షన్స్  కొరకు మారుతున్నప్పుడు ఇన్వెస్టర్లు పరిగణించాల్సినవి ఏవి? zoom-icon

మీరు ఫ్లైఇండియా ఎయిర్ లైన్స్ ద్వారా బెంగళూరు నుండి చెన్నైకు ఉదయం 8 గంటలకు ఫ్లైట్ బుక్ చేసుకున్నారని అనుకుందాము. మీరు తప్పు ఫ్లైట్ బుక్ చేసారని తెలుసుకున్నారు మరియు రీషెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నారు. ఫ్లైఇండియా మీకు ఎటువెటి రకమైన ఛార్జీలను మీకు ఛార్జ్ చేస్తుదని మీరు అనుకుంటున్నారు? ఒకే ఎయిర్లైన్ అయినప్పటికీ, ఒకే రోజు ప్రయాణం అయినా, ఒకే గమ్య స్థానం అయినా మరియు ఒకే ప్రయాణీకుడు అయినా మీరు మీ మనస్సుని మార్చుకున్నందుకు పెనాల్టీని చెల్లించాలి!

మ్యూచువల్ ఫండ్ విషయంలో, ఒకే స్కీము లోపల ఒక ఆప్షన్ నుండి మరొక ఆప్షన్కి మారడం ఒక సేల్గా (రిడెంప్షన్) పరిగణించబడుతుంది. కావున, స్విచ్కు మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేసారు అనే దానిని బట్టి ఎగ్జిట్ లోడ్ మరియు క్యాపిటల్ గెయిన్ టాక్స్ విధించబడతాయి.

రెండు ఆప్షన్స్ ఒకే స్కీములో విభిన్న ఎన్ఎవిలలో ఉన్నాయి మరియు విభిన్నంగా ఆపరేట్ చేస్తాయి.

  • గ్రోత్ ఆఫ్షన్స్ ఫండ్స్ చేసిన లాభాలను రీఇన్వెస్ట్ చేస్తూ కాంపౌండింగ్ శక్తి ప్రయోజనాన్ని మీకు వీలుకల్పిస్తాయి మరియు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కొరకు మరింత అనువుగా ఉంటాయి.
  • డివిడెండ్ ఆప్షన్ తన ఇన్వెస్టర్లలో ఫండ్ ద్వారా చేయబడిన లాభాన్ని పంచుకుంటుంది. ఈ ఆప్షన్ వారి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ నుండి రెగ్యులర్ ఆదాయం కొరకు చూసే వారికి మాత్రమే అనువైనది.

మీరు గ్రోత్ ఆప్షన్స్ నుండి డివిడెండ్కు లేదా దాని నుండి దీనికి మారాలని భావిస్తే, ఒక ఎగ్జిట్ లోడ్ లేదా క్యాపిటల్ గెయిన్ టాక్స్ వర్తిస్తుందా అని తనిఖీ చేయండి.

402