జాప్యం వలన కలిగే నష్టం (కాస్ట్ ఆఫ్ డిలే) కాలిక్యులేటర్

మీరు ఆలస్యంగా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా?
మీరు నిర్ణయం తీసుకునే ముందు, మీ రాబడిపై ఉండే ప్రభావాన్ని లెక్కించడాన్ని పరిగణించండి.

  ఈ రోజే పెట్టుబడి పెట్టండి తరువాత పెట్టుబడి పెట్టండి
సంవత్సరాలు
సంవత్సరాలు
10%
SIP ముగింపు వయసు
సంవత్సరాలు
సంవత్సరాలు
పెట్టుబడి పెట్టిన మొత్తం సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు
పెట్టుబడి పెట్టిన మొత్తం విలువ ₹ 1.20 లక్షలు ₹ 60,000
మీ పెట్టుబడి యొక్క తుది విలువ ₹ 2.05 లక్షలు ₹ 77,437
సంపద సృష్టి ₹ 84,845 ₹ 17,437
ఆలస్యం వలన కలిగే నష్టం  
₹ 1.27 లక్షలు
  ఈ రోజే పెట్టుబడి పెట్టండి తరువాత పెట్టుబడి పెట్టండి
సంవత్సరాలు
సంవత్సరాలు
10%
ఉపసంహరణ సమయంలో వయసు
సంవత్సరాలు
సంవత్సరాలు
పెట్టుబడి పెట్టిన మొత్తం సంవత్సరాలు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు
పెట్టుబడి పెట్టిన మొత్తం విలువ ₹ 1 లక్షలు ₹ 1 లక్షలు
మీ పెట్టుబడి యొక్క తుది విలువ ₹ 2.59 లక్షలు ₹ 1.61 లక్షలు
సంపద సృష్టి ₹ 1.59 లక్షలు ₹ 61,051
ఆలస్యం వలన కలిగే నష్టం  
₹ 98,323

పరిత్యాగ ప్రకటన:

గతంలో ప్రదర్శించిన పనితీరు భవిష్యత్తులో కొనసాగవచ్చు లేదా కొనసాగకపోవచ్చు మరియు ఇది భవిష్య రాబడులకు హామీ కాదు.
ఈ కాలిక్యులేటర్ؚలు కేవలం దృష్టాంత ప్రయోజనాలకు మాత్రమే కానీ అసలైన రాబడులను సూచించవు.
మ్యూచువల్ ఫండ్ؚలకు స్థిరమైన రాబడి రేటు ఉండదు అలాగే రాబడి రేటును అంచనా వేయడం సాధ్యపడదు. *ఇక్కడ చూపించిన విలువపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ఇది పరిగణలోకి తీసుకోదు.

జాప్యం వలన కలిగే నష్టం (కాస్ట్ ఆఫ్ డిలే) అంటే ఏమిటి?

పెట్టుబడి పెట్టడాన్ని కొన్ని సంవత్సరాలు వాయిదా వేసినప్పుడు అవసరమైన నగదు మొత్తాన్ని జాప్యం వలన కలిగే నష్టం (కాస్ట్ ఆఫ్ డిలే) సూచిస్తుంది.

జాప్యం వలన కలిగే నష్టం (కాస్ట్ ఆఫ్ డిలే) కాలిక్యులేటర్ అంటే ఏమిటి?

మీ వ్యవస్థాగత పెట్టుబడులను ఒక నిర్దిష్ట వ్యవధి వరకు ఆలస్యం చేయడం వలన కలిగే పరిణామాలను అర్ధం చేసుకోవడానికి జాప్యం వలన కలిగే నష్టం (కాస్ట్ ఆఫ్ డిలే) కాలిక్యులేటర్ మీకు సహాయపడుతుంది. మీరు మీ పెట్టుబడులను ఆలస్యం చేయడం వలన, మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన అదనపు నగదు మొత్తాన్ని తెలుసుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది.
మీరు చేసే కొద్దిపాటి ఆలస్యం కూడా మీ దీర్ఘ-కాలిక పెట్టుబడులపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది అని ఇది సూచిస్తుంది, కాబట్టి ఆర్ధికంగా విజయం సాదించడానికి వాటిని వెంటనే ప్రారంభించడం అవసరం.

ప్రజలు తమ పెట్టుబడులను ఆలస్యం చేయడానికి కారణమేమిటి?

పెట్టుబడులను పెట్టడాన్ని ఆలస్యం చేసే ప్రధాన కారణాలు ఈ క్రింది చూడవచ్చు:

  • తగిన ఆర్ధిక అవగాహన లేకపోవడం
  • స్పష్టమైన లక్ష్యాలు మరియు ప్రణాళికలు లేకపోవడం
  • వాయిదా వేయడం
  • సరైన విధంగా బడ్జెట్ చేయకపోవడం
  • భయంతో రిస్క్ؚ తీసుకోకపోవడం

పెట్టుబడులను ఆలస్యం చేయడం వలన గణనీయమైన పరిణామాలు ఉంటాయి:

  • మార్కెట్ؚలో సమయాన్ని కోల్పోవడం వలన దీర్ఘ-కాలిక లక్ష్యాలకు తగినన్ని నిధులు లేకపోవడం
  • మీ డబ్బు యొక్క కొనుగోలు శక్తి బలహీనపడటం
  • కాంపౌండింగ్ శక్తిని కోల్పోవడం

జాప్యం వలన కలిగే నష్టం (కాస్ట్ ఆఫ్ డిలే) కాలిక్యులేటర్ؚను మీరు ఎప్పుడు ఉపయోగించాలి?

పెట్టుబడిని వాయిదా వేయాలని భావిస్తున్నప్పుడు జాప్యం వలన కలిగే నష్టం (కాస్ట్ ఆఫ్ డిలే) కాలిక్యులేటర్ؚను ఉపయోగాన్ని పరిగణించండి. జాప్యం కారణంగా అవసరమయ్యే పెట్టుబడి మొత్తాలలో తేడాలను అంచనా వేయడంలో ఇది సహాయపడుతుంది, తద్వారా తక్షణ, ఆలస్య ఎంపికలను పోల్చి చూడవచ్చు మరియు అసలైన సంఖ్యల ఆధారంగా మెరుగైన నిర్ణయాలను తీసుకోవచ్చు.

జాప్యం వలన కలిగే నష్టం (కాస్ట్ ఆఫ్ డిలే) కాలిక్యులేటర్ ఉపయోగించడం వలన కలిగే ప్రయోజనాలు

  • సమయ-ఆధారిత అవకాశాలను పరిశీలించవచ్చు: కాల-పరిమితి కలిగిన పెట్టుబడి ఎంపికల విషయంలో తక్షణమే స్పందించడం లేదా ఆలస్యం చేయడం, ఏది ఆర్ధికంగా ప్రయోజనకరమో నిర్ధారించవచ్చు.
  • దీర్ఘ కాలిక వృద్ధిని విశ్లేషించవచ్చు: క్రమమైన పెట్టుబడులను వాయిదా వేయడం వలన అభివృద్ధిలో కలిగే సంభావ్య నష్టాన్ని మరియు కాంపౌండింగ్ ప్రభావాలను చూడవచ్చు.
  • పెట్టుబడి ఎంపికలను పోల్చవచ్చు: విభిన్న కాల పరిమితులు లేదా సంభావ్య రాబడులతో అనేక ఎంపికలలో పెట్టుబడులను జాప్యం చేయడం వలన కలిగే నష్టాలను లెక్కించవచ్చు మరియు పోల్చవచ్చు.

జాప్యం వలన కలిగే నష్టం (కాస్ట్ ఆఫ్ డిలే) కాలిక్యులేటర్ ఎలా పని చేస్తుంది?

ఈ కాలిక్యులేటర్ మార్కెట్ హెచ్చుతగ్గులు లేదా రాబడులపై బాహ్య ప్రభావాలను పరిగణనలోకి తీసుకోకుండా, ముందుగా నిర్వచించిన సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

ప్ర.1. పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవడంలో పెట్టుబడి జాప్యం వలన కలిగే నష్టం (కాస్ట్ ఆఫ్ డిలే) కాలిక్యులేటర్ ఎలా సహాయపడుతుంది?

జ. పెట్టుబడులను వాయిదా వేయడం వలన కలిగే ప్రభావాన్ని చూపడం ద్వారా అవగాహనాపూర్వక నిర్ణయాలను తీసుకోవడంలో పెట్టుబడి జాప్యం కాలిక్యులేటర్ సహాయపడుతుంది. పెట్టుబడులను ప్రారంభించడం మరియు మీ ఆర్ధిక లక్ష్యాల కోసం కృషి చేయడానికి సరైన సమయాన్ని నిర్ధారించడంలో ఇది మీకు సహాయపడుతుంది.

ప్ర.2. పెట్టుబడి ఆలస్యానికి అయ్యే ఖర్చును లెక్కించడం ఎందుకు ముఖ్యం?

జ. పెట్టుబడి జాప్యం వలన కలిగే నష్టాన్ని లెక్కించడం, పెట్టుబడులను త్వరగా ప్రారంభించవలసిన ప్రాముఖ్యతను మరియు వాటిని వాయిదా వేయడం వలన కోల్పోయే సంభావ్య అవకాశాల నష్టాలను మీరు అర్ధం చేసుకోవడంలో సహాయపడుతుంది.

ప్ర.3. పెట్టుబడి ఆలస్య కాలిక్యులేటర్ యొక్క ఖర్చు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది?

జ. మీరు పెట్టుబడి పెట్టాలనుకున్న మొత్తం, కాల పరిమితి, ఆశించిన రాబడులు మరియు వ్యవధిలో జాప్యం వంటి కారాకాలను సాధారణంగా కాలిక్యులేటర్ పరిగణిస్తుంది.

ప్ర.4. పెట్టుబడి జాప్యం వలన కలిగే నష్టం కాలిక్యులేటర్ ఫలితాలు సరైనవేనా?

జ. ఫలితాలు అనేవి కొన్ని అంచనాల ఆధారంగా చేసిన మదింపులు, అందువల్ల వీటిని ఖచ్చితమైన భవిష్య ఫలితాలుగా కాకుండా ఒక మార్గదర్శకాలుగా ఉపయోగించాలి.

పరిత్యాగ ప్రకటన :

1. దయచేసి గమనించండి, ఈ క్యాలిక్యులేటర్లు విశదీకరణ కొరకు మాత్రమే, వాస్తవ రాబడులను సూచించవు.

2. మ్యూచువల్ ఫండ్స్ కి స్థిరమైన రాబడి రేటు అంటూ ఉండదు, అంతేకాకుండా రాబడి రేటును ముందుగానే ఊహించడం సాధ్యం కాదు.

3. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.