పదవీ విరమణ ప్రణాళిక కాలిక్యులేటర్

మీ రిటైర్మెంట్ ఫండ్ భవిష్య బ్యాలెన్స్‌ను అంచనా వేయండి.

సంవత్సరాలు
సంవత్సరాలు
సంవత్సరాలు
%
%
%
పదవీ విరమణ తర్వాత వెంటనే అవసరం అయ్యే వార్షిక ఆదాయం
పదవీ విరమణ తర్వాత అవసరం అయ్యే మొత్తం కార్పస్ విలువ
కార్పస్‌ను సమకూర్చుకోవడానికి అవసరం అయ్యే నెలవారీ పొదుపులు

డిస్క్లైమర్:

గతంలో ప్రదర్శించిన పనితీరు భవిష్యత్తులో కొనసాగవచ్చు లేదా కొనసాగకపోవచ్చు మరియు ఇది భవిష్య రాబడులకు హామీ కాదు.
దయచేసి గమనించండి, ఈ క్యాలిక్యులేటర్లు విశదీకరణ కొరకు మాత్రమే, వాస్తవ రాబడులను సూచించవు.
మ్యూచువల్ ఫండ్స్ కి స్థిరమైన రాబడి రేటు అంటూ ఉండదు, అంతేకాకుండా రాబడి రేటును ముందుగానే ఊహించడం సాధ్యం కాదు.

MFSH పదవీ విరమణ ప్రణాళిక కాలిక్యులేటర్

ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ ప్రణాళిక చాలా అవసరం. పదవీ విరమణ ప్రణాళిక రూపొందించే ప్రక్రియలో ఆదాయ వనరులను గుర్తించడం, సమర్థవంతమైన పొదుపు స్కీమ్‌ను గుర్తించడం, అవసరమయ్యే నిధులను అంచనా వేయడం మరియు మీ ఆదాయంలో కొంత భాగాన్ని వివిధ ఆస్తులలో పెట్టుబడి పెట్టడం వంటి అనేక కీలక దశలు ఉంటాయి.

అయితే, దృడమైన పదవీ విరమణ జీవితం కోసం ఖచ్చితమైన లెక్కింపులను చేయడం మరియు మీ పెట్టుబడుల నుండి రాబడిని అంచనా వేయడం అనేది ఒక సవాలుగా నిలుస్తుంది. పదవీ విరమణ కాలిక్యులేటర్ అనేది వ్యక్తులకు పదవీ విరమణ కోసం అవసరమైన కార్పస్‌ను అంచనా వేయడానికి మరియు దానిని సాధించడానికి వారు ఎంత పొదుపు చేయలి లేదా పెట్టుబడి పెట్టాల్సిన మొత్తాన్ని నిర్ణయించడానికి సహాయపడుతుంది.

పదవీ విరమణ ప్రణాళిక అంటే ఏమిటి?

పదవీ విరమణ ప్రణాళిక అనేది పదవీ విరమణ కోసం సరైన ఆర్థిక స్థితిని సిద్ధం చేయడం. పదవీ విరమణ కోసం ప్రణాళిక వేసేటప్పుడు, మీరు ద్రవ్యోల్బణాన్ని పదవీ విరమణ అనంతర ఖర్చులను, పదవీ విరమణ కాలపరిమితిని, నష్టాలను అంచనా వేయడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలి మరియు తెలివిగా పెట్టుబడులను పెట్టాలి.

అంతేకాకుండా, ఆయుర్దాయం పెరుగుతున్నందున, మీ ఉద్యోగం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత సురక్షితమైన ఆర్థిక అవసరం చాలా అవసరం. మ్యూచువల్ ఫండ్స్ సహీ హే అందించే పదవీ విరమణ ప్రణాళిక కాలిక్యులేటర్ పదవీ విరమణ తర్వాత మీకు అవసరమైన నిధుల మొత్తాన్ని మరియు పదవీ విరమణకు ముందు మరియు తరువాత పెట్టుబడులపై మీరు పొందగల రాబడిని అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది.

MFSH పదవీ విరమణ ప్రణాళిక కాలిక్యులేటర్ అంటే ఏమిటి?

MFSH పదవీ విరమణ కాలిక్యులేటర్ అనేది మీ పదవీ విరమణ తర్వాత మీకు ఎంత డబ్బు అవసరమో చూపించే ఆన్‌లైన్ యుటిలిటీ టూల్. మీరు సమకూర్చుకోవలసిన పదవీ విరమణ కార్పస్ ఆధారంగా మీ పెట్టుబడిని ప్రణాళిక వేయడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది.

ఇది రెండు ప్రాథమిక మార్గాలలో ఉపయోగపడుతుంది మరియు అవి:

1. మీరు జీవిస్తున్న ప్రస్తుత జీవనశైలిని కొనసాగించడానికి మీ పదవీ విరమణ తర్వాత మీకు అవసరమైన డబ్బును ఇది మీకు చూపుతుంది.

2. ఇది మీ పెట్టుబడులపై రాబడులను అంచనా వేయడానికి మరియు మీ పదవీ విరమణ కార్పస్‌ను సమకూర్చుకోవడానికి మీరు ఎలా పెట్టుబడి పెట్టాలో అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది.

పదవీ విరమణ ప్రణాళిక కాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుంది?

MFSH పదవీ విరమణ కాలిక్యులేటర్‌లో ఒక ఫార్ములా బాక్స్ ఉంటుంది, ఇక్కడ మీరు మీ ప్రస్తుత వయస్సు, మీ పదవీ విరమణ వయస్సు, ఆయుర్దాయం మరియు పదవీ విరమణ తర్వాత అవసరమైన నెలవారీ ఆదాయాన్ని ఇన్‌పుట్ చేయడానికి ఎంచుకోవచ్చు. అంచనా ద్రవ్యోల్బణ రేటు, పెట్టుబడిపై ఆశించిన రాబడి, మీకు ప్రస్తుత పొదుపు ఏమైనా ఉందా అనే అంశాలను కూడా మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఈ వివరాలను ఇన్‌పుట్ చేసిన తర్వాత, కాలిక్యులేటర్ మీకు పదవీ విరమణ సమయంలో అవసరమైన వార్షిక ఆదాయం మరియు ఈ కార్పస్‌ను సమకూర్చుకోవడానికిమీరు చేయవలసిన నెలవారీ పొదుపును చూపుతుంది.

MFSH పదవీ విరమణ ప్రణాళిక కాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి?

మీరు ఈ కాలిక్యులేటర్‌ను కొన్ని దశలతో మాత్రమే ఉపయోగించవచ్చు మరియు దశలు క్రింద జాబితా చేయబడ్డాయి:

దశ 1: మీ ప్రస్తుత వయస్సును నమోదు చేయండి.

దశ 2: మీరు కోరుకున్న పదవీ విరమణ వయస్సును నమోదు చేయండి.

దశ 3: మీ ఆయుర్దాయాన్ని ఎంచుకోండి.

దశ 4: మీ పదవీ విరమణ సంవత్సరాలలో మీకు అవసరమైన నెలవారీ ఆదాయాన్ని నమోదు చేయండి.

దశ 5: దేశంలో అంచనా వేయబడిన ద్రవ్యోల్బణ రేటును నమోదు చేయండి.

దశ 6: పదవీ విరమణకు ముందు పెట్టుబడులపై ఆశించిన రాబడిని నమోదు చేయండి.

దశ 7: పదవీ విరమణ తర్వాత పెట్టుబడులపై ఆశించిన రాబడులను నమోదు చేయండి.

దశ 8: పదవీ విరమణ కోసం కేటాయించిన ప్రస్తుత పొదుపు లేదా పెట్టుబడులను ఇన్‌పుట్ చేయండి.

ఈ వివరాలను అందించగానే, కాలిక్యులేటర్ డిస్‌ప్లే పై వీటిని చూడవచ్చు:

  • • పదవీ విరమణ తర్వాత అవసరమైన వార్షిక ఆదాయం.
  • • సమకూర్చుకోవాల్సిన అదనపు నగదు.
  • • అవసరమైన కార్పస్‌ను సమకూర్చుకోవడానికి అవసరం అయ్యే నెలవారీ పొదుపు వివరాలు.

MFSH పదవీ విరమణ ప్రణాళిక కాలిక్యులేటర్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

పదవీ విరమణ కాలిక్యులేటర్ ఉపయోగించడం వల్ల కలిగే ప్రాథమిక ప్రయోజనాలు:

ఇది పదవీ విరమణ కోసం పొదుపు చేయడానికి సహాయపడుతుంది: పదవీ విరమణ కోసం పొదుపు చేయడం 20, 30 ఏళ్ల వయస్సు లోనే ప్రారంభించాల్సిన అవసరం ఉంటుంద. కాలిక్యులేటర్ వ్యక్తులకు అవసరమైన నిధులను మరియు నిర్ణీత కాలవ్యవధిలో వాటిని ఎలా సమకూర్చుకోవాలో తెలియజేయడం ద్వారా ముందస్తు పొదుపు మరియు పెట్టుబడుల అవసరాన్ని తెలుపుతుంది.

పదవీ విరమణ తరువాత అవసరమైన అంచనా నగదును తెలుసుకోవడానికి సహాయపడుతుంది: మీ పదవీ విరమణ తరువాత మీకు ఖచ్చితంగా ఎంత అవసరమో అంచనా వేయడం కష్టం, మరియు ఈ కాలిక్యులేటర్ ఈ అంచనాను అప్రయత్నంగా పూర్తి చేస్తుంది. అంతేకాకుండా, అవసరమైన కార్పస్‌ను నిర్ణీత కాలవ్యవధిలో సమకూర్చుకోవడానికి మీరు ప్రస్తుతం చేయాల్సిన పెట్టుబడులు లేదా పొదుపు మొత్తాన్ని ఇది మీకు తెలియజేస్తుంది.

పదవీ విరమణలో అదనపు ఖర్చుల కోసం ప్రణాళిక వేయడానికి ఇది సహాయపడుతుంది: మీ పదవీ విరమణతరువాత అదనపు ఖర్చులు ఉంటే, మీరు దాని కోసం ముందుగానే ప్లాన్ చేయవచ్చు మరియు సిద్ధంగా ఉండవచ్చు, ఎందుకంటే మీకు ఇప్పటికే పదవీ విరమణ జీవిత ఖర్చులు తెలిసినందునతెలుసు.

తరచుగా అడిగే ప్రశ్నలు

Q1. మ్యూచువల్ ఫండ్స్ సహీ హే పదవీ విరమణ కాలిక్యులేటర్ అంటే ఏమిటి?

MFSH పదవీ విరమణ ప్రణాళిక కాలిక్యులేటర్ అనేది ఒక ఆన్‌లైన్ సాధనం, ఇది పదవీ విరమణ తర్వాత మీ జీవితానికి అవసరమైన కార్పస్ మొత్తాన్ని అంచనా వేయడంలో మీకు సహాయపడుతుంది.

Q2. MFSH పదవీ విరమణ కాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుంది?

ఈ కాలిక్యులేటర్ మీ పదవీ విరమణ తర్వాత అవసరమైన మొత్తాన్ని లెక్కించడానికి ఫార్ములా బాక్స్‌ను ఉపయోగిస్తుంది.

Q3. పదవీ విరమణ ప్రణాళిక కాలిక్యులేటర్‌లో నేను ఏ వివరాలను అందించాలి?

మీ ప్రస్తుత వయస్సు, ఆయుర్దాయం, పదవీ విరమణ తర్వాత మీకు అవసరమైన నెలవారీ ఆదాయం, మీ అంచనా వేసిన రాబడి రేటు మరియు ద్రవ్యోల్బణ రేటును మీరు అందించాలి.

Q4. నా పదవీ విరమణ కోసం కార్పస్ సమకూర్చుకోవాడానికి సిఫార్సు చేయబడిన పెట్టుబడి మార్గాలు ఏమిటి?

ఈక్విటీ పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లు, PPF, నేషనల్ పెన్షన్ స్కీమ్ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు.

Q5. పదవీ విరమణ ప్రణాళిక కాలిక్యులేటర్ ఖచ్చితమైనదా?

పదవీ విరమణ కాలిక్యులేటర్ లెక్కలకు ఖచ్చితమైనది. అయితే, మీ పెట్టుబడుల ప్రమాదాలు, ఊహించని అత్యవసర పరిస్థితులు మరియు మరెన్నో ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.