డెట్ ఫండ్స్ ఫిక్సిడ్ డిపాజిట్ల లాంటివా?

Video

మీరు మీ డబ్బుని బ్యాంకులో ఒక ఫిక్సిడ్ డిపాజిట్ (ఎఫ్.డి) చేసినప్పుడు, బ్యాంకు మీకు స్థిరమైన వడ్డీని చెల్లించడానికి హామీ ఇస్తుంది. ఇక్కడ మీరు బ్యాంకుకు డబ్బుని అప్పుగా ఇచ్చారు మరియు బ్యాంకు మీ డబ్బు రుణ గ్రహీత, మీకు కాలానుక్రమమైన వడ్డీని చెల్లిస్తుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ డెట్ సెక్యూరిటీస్ అయిన గవర్నమెంట్ బాండ్లు, కంపెనీ బాండ్లు, మనీ మార్కెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తాయి. బాండ్లు కార్పొరేట్లు అయిన పవర్ కంపెనీలు, బ్యాంకులు హోమ్ ఫైనాన్స్ కంపెనీలు మరియు గవర్నమెంట్ లాంటి వాటి ద్వారా జారీ చేయబడతాయి. ఈ బాండ్ జారీ చేయువారు వారి ఇన్వెస్టర్ల కొరకు (వారి బాండ్లను కొనే వారకి), బాండ్లలో వారి డబ్బును ఇన్వెస్ట్ చేసినందుకు తిరిగి ఒక కాలానుక్రమ వడ్డీని చెల్లించడానికి హామీని ఇస్తాయి.

బాండ్ జారీచేసే వారు బ్యాంకు లాగా (రుణగ్రహీత) ఉంటారు మన ఎఫ్డి ఉదాహరణలా. ఇన్వెస్టర్ల నుండి డబ్బుని అప్పుగా తీసుకోవడం మరియు కాలానుక్రమ వడ్డీని చెల్లిస్తామని హామీ ఇవ్వడం లాంటివి చేస్తారు. మీరు ఒక బ్యాంకు ఎఫ్డిలో ఇన్వెస్టర్ కాగా, డెట్ ఫండ్స్ ఈ బాండ్లకు ఇన్వెస్టర్లుగా ఉంటాయి. ఒక ఎఫ్డి నుండి మీరు వడ్డీని సంపాదించినట్లుగా, డెట్ ఫండ్స్ వారి

మరింత చదవండి