తక్కువ వయసులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించడానికి ఐదు కారణాలు

తక్కువ వయసులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించడానికి ఐదు కారణాలు

పెట్టుబడి చేయడం అనేది ప్రజలు తమ ఆర్ధిక సంబంధిత భవిష్యత్తును సంరక్షించుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం అయినప్పటికీ, దానిని ఆరంభించడానికి తరచుగా వారు ఆలస్యం చేస్తూ ఉంటారు. తొలిసారి ఉద్యోగం సంపాదించుకున్న వారిలో తమ భవిష్యత్తు కొరకు ప్రణాళిక చేసుకోవడం కన్నా తమ జీవనశైలిని మెరుగుపరచుకోవడం సర్వ సాధారణం. మరో విధంగా చెప్పాలంటే, వారు జీవితంలో పెట్టుబడి చేయడాన్ని ఆలస్యంగా ఆరంభిస్తారు.

పెట్టుబడి చేయడం ఎప్పుడైనా ఆరంభించవచ్చు, కానీ త్వరగా ఆరంభించడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. పైగా, జీవితంలో ఆలస్యంగా ఎప్పుడో పెట్టుబడి చేయడం కన్నా త్వరగా పెట్టుబడి చేయడం వలన యువ మదుపుదారులు మరింత ఎక్కువ ఆదా చేయగలుగుతారు. ఎందుకంటే, వారి వృత్తి సంబంధిత ప్రయాణ ఆరంభంలో వారికి బాధ్యతలు తక్కువగా ఉంటాయి.

చిన్న వయస్సులో పెట్టుబడి చేయడం ఆరంభించడానికి ఐదు ప్రధాన కారణాలను చూద్దాం:

  1. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఆస్వాదించడం

త్వరగా పెట్టుబడి చేయడం వలన అత్యంత గణనీయమైన ప్రయోజనం ఏంటంటే, మీ నిష్క్రమణ సమయంలో మీకు అదనపు సమయం ఉంటుంది. కాంపౌండింగ్ సహాయంతో, కాలక్రమేణా మీ పెట్టుబడిని మీరు పెంచుకోగల అత్యుత్తమ సంభావ్యత ఉంటుంది. మీ రాబడి కాంపౌండింగ్ అయినప్పుడు, మీ పెట్టుబడుల మీద మీరు పొందే వడ్డీ, మరింత రాబడిని రూపొందించేందుకు పెట్టుబడి చేయబడుతుంది.

ఒక ఉదాహరణను చూద్దాం:

25 సంవత్సరాల వయస్సులో మీకు మొదటి జీతం వచ్చినప్పుడు, మీరు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆరంభించారనుకుందాం.  సంవత్సరానికి 10% సగటు రాబడి వద్ద రూ.1000తో ఒక SIPని ఆరంభించారు.

వయస్సు

మీరు పెట్టుబడి చేసిన సమయం

పెట్టుబడి చేసిన మొత్తం (రూ)

ఆర్జించిన మొత్తం మూలనిధి (రూ.)

35

10 సంవత్సరాలు

1.2 లక్షలు

2.05 లక్షలు

45

20 సంవత్సరాలు

2.4 లక్షలు

7.59 లక్షలు

55

30 సంవత్సరాలు

3.6 లక్షలు

22.6 లక్షలు

60

35 సంవత్సరాలు

4.2 లక్షలు

37.97 లక్షలు

*ఇది ఖచ్చితంగా ఒక ఉదాహరణ మాత్రమే. పట్టికలో చూపబడిన రిటర్నులు పూర్తిగా ఊహించినవి మరియు ఉదాహరణకు మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్స్ ఎటువంటి హామీ గల వడ్డీ రేటుని అందించవు.

మీరు గనక గమనిస్తే, రూ.1,000ల పెట్టుబడి సైతం కాలక్రమేణా గణనీయమైన సంపదను నిర్మించడంలో మీకు సహాయపడగలదు.

ఇక్కడ, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది పెద్ద మొత్తంలో చేసే పెట్టుబడులకు కూడా వర్తిస్తుందని గమనించడం ప్రథానం.

  1. రిస్కు తీసుకోగల మీ సామర్ధ్యాన్ని మెరుగుపరచుకోవడం

రివార్డుతో రిస్కుకు సహసంబంధం కలిగి ఉంటుందనడంలో సందేహమే లేదు. ఒక దీర్ఘకాల పెట్టుబడి మీ రిస్కును మెరుగ్గా నిర్వహించడంలో మీకు సహాయపడగలదు. చిన్న వయస్సులో, మీరు సాపేక్షంగా రిస్కుతో కూడిన అవెన్యూలలో పెట్టుబడి చేసే అవకాశం ఉంటుంది, క్రమంగా మీ వయస్సు పెరిగే కొలదీ ఆ రిస్కు తగ్గుతూ ఉంటుంది. మీరు పెరిగే కొలదీ, EMIలు, పిల్లల చదువులు, తాకట్లు మొదలైనటువంటి బరువు బాధ్యతల కారణంగా అధిక రిస్కులు తీసుకోవడం మీకు భారంగా అనిపించవచ్చు. చిన్నవయస్సులో పెట్టుబడి చేయడం వలన రిస్కులను తగ్గించి, ఎటువంటి ఆర్ధిక సంబంధిత ఒత్తిడి లేకుండా సంపదను నిర్మించుకునే అవకాశం కలుగుతుంది.

  1. నష్టాల నిర్వహణను సులభం చేస్తుంది

మీరు  తక్కువ వయసులో ప్రారంభిస్తే, మీకు కొంత సమయం ఉంటుంది. ఎందుకంటే, తప్పుడు నిర్ణయాలు లేదా మార్కెట్ అస్థిరత నష్టాలకు దారి తీయవచ్చు. అవసరమైతే మీరు మీ పెట్టుబడి విధానాన్ని పునఃపరిశీలించవచ్చు తద్వారా నష్టాలను మెరుగ్గా నిర్వహించవచ్చు. ఉదాహరణకు, మార్కెట్లలో అస్థిరత ఉంటే, మ్యూచువల్ ఫండ్ SIPలలో  పెట్టుబడి పెట్టడం ద్వారా దాన్ని  మెరుగ్గా నిర్వహించగలరు. SIPల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి చేయడం ఆరంభించినప్పుడు, మార్కెట్ పడిపోయి ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లను, మార్కెట్ పుంజుకున్నప్పుడు తక్కువ యూనిట్లను కొనడం ద్వారా మీరు ప్రథానంగా మీ పెట్టుబడి ఖర్చును బ్యాలెన్స్ చేస్తున్నారు. దీనినే రుపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. మీరు తక్కువ వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, రూపాయి వ్యయ సగటు మీ నష్టాలను మెరుగ్గా నిర్వహించడానికి మీకు సహాయపడుతుంది. 

  1. అవగాహనాపూర్వక నిర్ణయాలను తీసుకోవడం

మీ వద్ద ఎక్కువ సమయం ఉన్నప్పుడు, వివిధ పెట్టుబడి వికల్పాలను మీరు బేరీజు వేయవచ్చు, ఇంకా అవసరమైనప్పుడల్లా మీ పోర్ట్‌ఫోలియోను తిరిగి బ్యాలెన్స్ చేయవచ్చు, మీ పెట్టుబడులకు కాస్త సమయం ఇచ్చి, రిస్కులను తగ్గించి, మీ రాబడులను పెంచుకోవచ్చు. పైగా, త్వరగా పెట్టుబడి చేయడం వలన, ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి, మార్కెట్లోని సూక్ష్మ బేధాలను అర్ధం చేసుకుంటూ, చక్కగా విచారించి, మెరుగుపరుచుకుంటూ, మీ ఒత్తిడిని లేదా జీవితంలో ఆలస్యంగా పెట్టుబడి చేయడంలో ఉండే భయాన్ని తగ్గించుకోవచ్చు.

  1. శ్రీఘ్ర పదవీవిరమణా లక్ష్యాన్నిత్వరగా నెరవేర్చుకోవడం

మీ పదవీవిరమణ లక్ష్యాన్ని త్వరగా చేరుకోవడం అనేది మీరు సరైన పెట్టుబడి అవెన్యూలలో, త్వరగా పెట్టుబడి చేయడంతో సాధ్యపడవచ్చు.

మీరు త్వరగా పదవీవిరమణ తీసుకోవడానికి రూ.1 కోటి లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారనుకుందాం.

25 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి చేయడం ఆరంభించారు

35 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి చేయడం ఆరంభించారు

SIP మొత్తం (రూ)

10,100

SIP మొత్తం (రూ)

10,100

ఊహించిన రాబడి రేటు

12%

ఊహించిన రాబడి రేటు

12%

పెట్టుబడి చేసిన మొత్తము (రూ)

24.24 లక్షలు

పెట్టుబడి చేసిన మొత్తము (రూ)

12.12 లక్షలు

అంతిమ మూలనిధి, 45 సంవత్సరాల వద్ద (రూ)

1 కోటి

అంతిమ మూలనిధి, 45 సంవత్సరాల వద్ద (రూ)

23.5 లక్షలు

*ఇది ఖచ్చితంగా ఒక ఉదాహరణ మాత్రమే. పట్టికలో చూపబడిన రిటర్నులు పూర్తిగా ఊహించినవి మరియు ఉదాహరణకు మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్స్ ఎటువంటి హామీ గల వడ్డీ రేటుని అందించవు.

పై ఉదాహరణలో విశదీకరించినట్లుగా, మీ లక్షిత మొత్తాన్ని త్వరగా చేరుకోవడానికి త్వరగా పెట్టుబడి చేయడం సహాయపడవచ్చు, అంతేకాకుండా, త్వరగా పదవీవిరమణ తీసుకోవడం (లేదా ఏదైనా ఇతర లక్ష్యాన్ని) సాధించడంలో కూడా సహాయపడవచ్చు.

సారాంశం

మీ పెట్టుబడులను త్వరగా ఆరంభించడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. యువ మదుపుదారునిగా, మార్కెట్లో వెచ్చించే సమయం వలన కలిగే ప్రయోజనాన్ని పొందవచ్చు, ఇది మీ ఆర్ధిక సంబంధిత లక్ష్యాలను త్వరగా చేరుకోవడంతో బాటూ రిస్కు నిర్వహణలో మరియు అత్యవసర నిధిని ఏర్పరచుకోవడంలో సహాయపడుతుంది. కాబట్టి, మీ పెట్టుబడులను వృద్ధి చేసుకోవడంలో మీ అవకాశాలను పెంచుకోవాలని మీరు అనుకుంటే, చిన్న వయస్సులో పెట్టుబడి చేయడం ఆరంభించడం పూర్తిగా లాభదాయకం.

డిస్క్లైమర్:

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

286

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?