ఇండెక్స్ ఫండ్‌లు ఇతర మ్యూచువల్ ఫండ్ల కన్నా ఎలా భిన్నంగా ఉంటాయి?

Video

పలు స్టాక్‌ల వ్యాప్తంగా పెట్టుబడి చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్‌లు మరియు ఇండెక్స్ ఫండ్‌లు వైవిధ్యీకరణను అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్‌లు వాటిలో నిర్వచించిన పెట్టుబడి ఉద్దేశ్యానికి అనుగుణంగా రాబడులను జెనరేట్ చేసే నిమిత్తం స్టాకులను ఎంచుకునే ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉండగా, ఇండెక్స్ ఫండ్‌లు ఒక నిర్దిష్ట ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తాయి. కాబట్టి ఇండెక్స్ ఫండ్‌లు ఇండెక్స్‌లో చేర్చిన స్టాక్‌లలోనే పెట్టుబడి చేస్తాయి. ఇండెక్స్ ఫండ్‌లు తమ పోర్ట్‌ఫోలియో కొరకు స్టాక్‌లను ఎంచుకోవడంలో చురుకైన నిర్ణయాన్ని తీసుకోవు కాబట్టి వాటిని నిష్క్రియాత్మకంగా నిర్వహించబడిన ఫండ్‌లు అంటారు.

ఇండెక్స్ ఫండ్‌లు సగటు మార్కెట్ రాబడిని జెనరేట్ చేయగలిగి ఉండగా క్రియాత్మకంగా నిర్వహించబడ్డ మ్యూచువల్ ఫండ్‌లు తమ పోర్ట్‌ఫోలియో కొరకు స్టాక్ ఎంపిక మీద క్రియాశీల కాల్స్ తీసుకోవడం ద్వారా ఆల్ఫా(తమ బెంచ్‌మార్క్ రాబడికి అదనంగా రాబడి)ను జెనరేట్ చేస్తుంది. కేవలం ఒక సూచీని అనుసరించి, తమ సూచీతో అనుగుణంగా రాబడిని జెనరేట్ చేసే ఇండెక్స్ ఫండ్‌లతో పోలిస్తే అధికంగా ఆశించే రాబడి అధిక రిస్కు ధర వద్ద వస్తుంది.

క్రియాశీలంగా నిర్వహించబడే ఫండ్‌లు అధిక నిర్వహణా రుసుములను తద్వారా అధిక వ్యయ నిష్పత్తిని కలిగి ఉండగలవు, ఎందుకంటే ఫండ్ మేనేజరులను నియామకం చేసుకునేందుకు భారీ రుసుములను వారు చెల్లించవలసి ఉంటుంది.

మరింత చదవండి

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?