మ్యూచువల్ ఫండ్స్ మరియు పోర్ట్‌ఫోలియో మేనేజిమెంట్ సర్వీసెస్ (పిఎమ్ఎస్) ఇన్వెస్టర్లు వారి డబ్బుని పూల్డ్ ఇన్వెస్ట్మెంట్ వేహికల్లో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ల ద్వారా నిర్వహించేబడే స్టాక్సు మరియు బాండ్లలో ఇన్వెస్ట్ చేయడానికి వీలుకల్పిస్తాయి, అవి రెండూ రెండు విభిన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ఇవి విభిన్న ఉద్దేశ్యాలను కలిగి మరియు రెండు విభిన్న రకాల ఇన్వెస్టర్ల కొరకు ఉన్నాయి.
మ్యూచువల్ ఫండ్‌లో ఎవరైనా నెలకి రూ.500/- నుండి ఇన్వెస్ట్ చేయవచ్చు కానీ పిఎమ్ఎస్ స్కీములకు కనీస ఇన్వెస్ట్మెంట్ రూ. 25 లక్షలు ఉండాలి ఎందుకంటే అవి ప్రాథమికంగా హెచ్ఎన్ఐలు లక్ష్యంగా ఉన్న వెల్త్ మేనేజిమెంట్ ప్రొడక్ట్‌లు. మ్యూచువల్ ఫండ్స్‌ను భారీగా ఎస్ఇబిఐ ద్వారా నియంత్రించబడతాయి కాగా పిఎమ్ఎస్ స్కీములకు కఠినమైన వెల్లడి నియమాలు ఉండవు. ఇంకా, పిఎమ్ఎస్ ప్రాడక్టులు అడ్వాన్స్డ్ ఇన్వెస్టర్ల కొరకు ఉన్నాయి మార్కెట్లో సులువుగా ట్రేడ్ చేయలేని సెక్యూరిటీలలో పిఎమ్ఎస్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి కావున వారు రిస్కులను అర్థం చేసుకోగలరు. మ్యూచువల్ ఫండ్స్ లిక్విడ్‌లో ఉన్న సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తాయి. వాటి సరైన వైవిధ్యమైన పోర్ట్ ఫోలియో వలన మ్యూచువల్ ఫండ్స్ పిఎమ్ఎస్ కన్నా తక్కువ రిస్కుతో ఉన్నవి. పిఎమ్ఎస్ ఫండ్స్ సాధారణంగా 20- 30 స్టాకుల కాన్సెంట్రేటెడ్ పోర్ట్‌ఫోలియోని కలిగి ఉంటుంది. అలా, ఫండ్ పనితీరు పూర్తిగా ఫండ్ మేనేజర్ స్టాక్ ఎంపిక సమర్థత పైన ఆధారపడి ఉంటుంది.
పిఎమ్ఎస్ ఫండ్స్ కి ఫండ్ మేనేజిమెంట్ ఫీజు కాకుండా అధిక ఎంట్రీ మరియు ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ కి ఎంట్రీ లోడ్ ఉండదు మరియు చిన్నని ఎగ్జిట్ లోడ్ ఉండగలదు. మ్యూచువల్ ఫండ్స్ రిటెయిల్ ఇన్వెస్టర్లకు అనువైనవి కాగా పిఎమ్ఎస్ ఫఁడ్స్ రిటైల్ ఇన్వెస్టర్ల కొరకు తగినవి కావు.