ఒక డిస్ట్రిబ్యూటర్ వంటి ఒక మధ్యవర్తి ద్వారా మ్యూచువల్ ఫండ్‌లో మీరు పెట్టుబడి చేసినప్పుడు, మీరు ఆయా స్కీం యొక్క రెగ్యులర్ ప్లాన్‌లో అంతిమంగా పెట్టుబడి చేస్తారు. మధ్యవర్తి ద్వారా చేసే పెట్టుబడుల వలన కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. మీ స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాల కొరకు తగిన స్కీంలను ఎంచుకోవడంలో మీ డిస్ట్రిబ్యూటర్ మీకు సహాయపడవచ్చు. మీరు గనక కొత్త మదుపరుడు అయితే, KYC వంటి ఫార్మాలిటీలు పూర్తి చేయడం, SIP/SWP/STP వంటి వాటి పత్రాలను నింపడమే కాకుండా వాటిని సెటప్ చేయడం వంటి వాటిలో డిస్ట్రిబ్యూటర్ సహాయపడవచ్చు. మీ ఆర్ధిక లక్ష్యాలు మారినప్పుడు గానీ, లేదా లాభాలు పొందేందుకు లేదా కోరుకున్న అసెట్ కేటాయింపు నిర్వహణకు మీ పోర్ట్‌ఫోలియోను తిరిగి సమతౌల్యం చేయవలసి వచ్చినప్పుడు గానీ మీ పోర్ట్‌ఫోలియోను అడ్జస్ట్ చేయడంలో కూడా డిస్ట్రిబ్యూటర్ సహాయపడవచ్చు. మీ పోర్ట్‌ఫోలియో గురించి మీరెప్పటికప్పుడు తెలుసుకునేలా నిర్ధారించుకోవడం, చిరునామా, నామినీ మొదలగు వివరాలు మార్చవలసివచ్చినప్పుడల్లా మీ వ్యక్తిగత వివరాలను నవీకరించడం వంటి సేవలను కూడా మధ్యవర్తులు అందిస్తారు.
అయితే, ఆర్ధిక మార్కెట్లు, అందుబాటులో ఉన్న మ్యూచువల్ ఫండ్ స్కీముల వివిధ రకాలు, స్కీం ప్రదర్శనా తీరులను పోల్చడం ఎలా, పెట్టుబడి ఉద్దేశ్యాలు, రిస్క్ కారకాలు మరియు ఫండ్ పోర్ట్‌ఫోలియోల అవగాహన, మీ ఆర్ధిక లక్ష్యాల కొరకు ఏ రకపు ఫండ్ సరిగ్గా సరిపోతుంది అనేది అర్ధం చేసుకోవడం వంటి వాటి గురించి సముచిత అవగాహన మీకు ఉంటే, డైరెక్ట్ ప్లాన్‌లో పెట్టుబడి చేయడం మీకు సఫలం కావచ్చు. ఆన్లైన్లో పెట్టుబడి పెట్టడం, మీ కెవైసిని పూర్తి చేయడం, ఒక SIP కొరకు ECS డెబిట్‌ను సెటప్ చేయడం వంటి వాటితో మీరు సౌకర్యవంతంగా ఉంటే, సరాసరిగా ఒక మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి చేయడాన్ని మీరు ఖచ్చితంగా పరిగణించవచ్చు.