మీరు మాల్దీవులకు సెలవులకు వెళ్లాలని అనుకుంటున్నారు అనుకోండి, మీకు ఆ ప్రదేశం గురించి ఎక్కువ తెలియదు. మీరు మీ ట్రిప్ ప్లాను ఎలా ప్లాను చేసుకుంటారు? మీరు ఒక ప్రయాణ ఏజెంటుకు కాల్ చేసి మీ ట్రప్ బుక్ చేసుకోవచ్చు లేదా వసతి, సందర్శించవలసిన ప్రదేశాలు, రవాణా రకాలు మొదలైన వాటి గురించి పరిశోధన చేస్తూ గంటలు వెచ్చించి, చివరకు మీ ప్రయాణాన్ని రూపొందించి, మీ బుకింగ్‌లు చేయవచ్చు. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటంటే మీరు సొంతంగా ఈ మొత్తం పని చేయడానికి బదులు, సహాయం తీసుకుని, వేరే వారి ద్వారా చేయడాన్ని ఎంచుకున్నారు.
డైరెక్ట్ మరియు రెగ్యులర్ ప్లాన్ల మధ్య కూడా ఇలాంటి బేధమే ఉంది. మీరు ఒక డిస్టిబ్యూటర్ ద్వారా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే, మీ డబ్బు రెగ్యులర్ ప్లాను ద్వారా పెట్టుబడి పెట్టబడుతుంది. అదే మీరు నేరుగా ఒక ఫండ్‌లో పెట్టుబడి పెడితే, మీ డబ్బు ఆ స్కీము డైరెక్ట్ ప్లానులో పెట్టుబడి పెట్టబడుతుంది. రెండు ప్లాన్లు మీకు అదే స్కీమును మరియు పోర్ట్‌పోలియోకు అవకాశం ఇస్తుంటే, వాటి NAVలు మరియు వ్యయ నిష్పత్తిలో మాత్రమే తేడా ఉంటుంది. రెగ్యులర్ ప్లానులో డిస్టిబ్యూటర్‌కు తప్పక కమీషన్ చెల్లించవలసి ఉంటుంది
మరింత చదవండి