మొదలు పెట్టడానికి, మీ పెట్టుబడికి కావలసిన సరియైన స్కీము ఎన్నుకోవడం ముఖ్యము. దానిని ఇలా గుర్తించండీ.
మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ రవాణా పద్ధతిని ఎంపిక చేసుకేవాలో మీరు ఎలా నిర్ణయిస్తారు? మీరు నడవాలో, ఆటో రిక్షా తీసుకొవాలొ, రైలు లేదా ఫ్లైట్ ఎక్కాలో, ఇదంతా మీ గమ్యస్థానం, మీ బడ్జెట్ మరియు ఉండే ప్రయాణ సమయాన్ని బట్టి ఉంటుంది.
మీ ఆర్థిక లక్ష్యాల కొరకు ప్లాన్ చేయడం లొ కూడా ఇవే సూత్రాలను ఉపయోగపడతాయి.
విభిన్న ప్రయాణ అవసరాలకు విభిన్న ప్రయాణ పద్ధతులు – విభిన్న అవసరాలకు విభిన్న స్కీములు (లేదా స్కీముల మేళవింపు).
ఒకరు వారి లఘు కాల అవసరాలకు లిక్విడ్ ఫండ్స్; మధ్యస్థ కాల అవసరాలకు ఇన్కమ్ ఫండ్స్ మరియు దీర్ఘకాల అవసరాలకు ఈక్విటీ ఫండ్స్ (లేదా విభిన్న ఫండ్స్ మేళవింపు) పరిగణించవచ్చు. విభిన్న ఇన్వెస్టర్లు అసెట్ వర్గంలో ఉండే విభిన్న స్కీములలో వారు తీసుకో తలచిన రిస్కుని బట్టి పెట్టుబడి పెట్టవచ్చు.
ప్రతి ఇన్వెస్టర్ అవసరాల కోసం మ్యూచ్‌వల్ ఫండ్స్ లో పరిష్కారాలు ఉన్నాయని, గుర్తుంచుకోండి. ఏ పరిష్కారం సముచితమైనదో కనుగొనడం వారి నిర్దిస్టమైన అవసరం అని అర్థం చేసుకోవడం ముఖ్యము.