ఒకసారి ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించితే, అతను ఎటువంటి రకమైన పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోవాలి - ఫిక్స్డ్ ఇన్కం, ఈక్విటీ లేదా బ్యాలెన్స్డ్ మరియు ఏ అసెట్ మేనేజిమెంట్ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి?
ముందుగా మీ ఉద్దేశ్యము, మీకు అనుకూలమైన కాలవ్యవధి మరియు మీరు ఎదుర్కోగల రిస్క్ గురించి ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా పెట్టుబడి సలహాదారుతో నిస్సంకోచంగా చర్చించండి.
ఈ సమాచారాన్ని బట్టి ఏ ఫండ్లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయాలు చేయబడతాయి.
- మీకు దీర్ఘ కాల ఉద్దేశ్యం ఉంటే – రిటైర్మెంట్ ప్లానింగ్, కొంత రిస్కు తీసుకోవడానికి ఆసక్తితో ఉంటే, అప్పుడు ఈక్విటీ లేదా సమతుల్య నిధి ఆదర్శం కాగలదు.
- మీకు చాలా లఘు కాల ఉద్దేశ్యం ఉంటే– కొన్ని నెలలకు డబ్బుని పక్కకు పెట్టాలనుకుంటే; ఒక లిక్విడ్ ఫండ్ ఆదర్శం కాగలదు.
- మీ ఆలోచన రెగ్యులర్ ఆదాయం పొందాలని ఉంటే, అప్పుడు నెలవారీ ఆదాయ ప్రణాళిక లేదా ఇన్కం ఫండ్ సిఫార్సు చేయబడుతుంది.
పెట్టుబడి పెట్టడానికి ఫండ్ రకం నిర్ణయించిన తరువాత, ఎఎమ్సి నుండి నిర్దిష్ట స్కీము నిర్ణయం చేయాలి. ఈ నిర్ణయాలు సాధారణంగా ఎఎమ్సి ట్రాక్ రికార్డ్ స్కీము పరిశీలించిన తరువాత, పోర్ట్ఫోలియో వివరాలు, మొదలగునవి నిర్ధారించిన తరువాత చేయబడతాయి.
స్కీము పాక్ట్ షీట్లు మరియు కీలక సమాచార మెమొంరాండం అనెవి రెండు రకాలు ప్రతి ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టడానికి ముందు పరిశీలన చేయవలసిన డాక్యుమెంట్లు. ఎవరికైనా వివరణాత్మక సమాచారం కావాలంటే అప్పుడు వారు స్కీమ్ సమాచార డాక్యుమెంట్ని చూడాలి. వీటిని అన్నిటినీ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లో సులభంగా చుడవచ్చు .