డిడిటి నా పెట్టుబడిని ఎలా ప్రభావితం చేస్తుంది?

డిడిటి నా  పెట్టుబడిని ఎలా ప్రభావితం చేస్తుంది? zoom-icon

ఏప్రిల్ 2020కు ముందు, మ్యూచువల్ ఫండ్ డివిడెండ్లు పెట్టుబడిదారులకు పన్ను లేకుండా ఉండేవి, అంటే తమ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల నుండి వచ్చిన డివిడెండ్ ఆదాయం మీద ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. ఫండ్ హౌస్ పంపిణీ చేసే నికర మిగులును లెక్కించడానికి పంపిణీ చేయగల మిగులు (లాభం) నుండి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (DDT) మినహాయించబడేది. ఈ మొత్తాన్ని ఫండ్‌లో డివిడెండ్ ఆప్షన్ ఎంచుకున్న పెట్టుబడిదారులకు ఉన్న యూనిట్ల నిష్పత్తిలో పంపిణీ చేయబడేది. 

ఇప్పుడు, మ్యూచువల్ ఫండ్స్ మూలం నుండి DDT మినహాయించాల్సిన  అవసరం లేదు, కానీ మ్యూచువల్ ఫండ్స్ నుండి వచ్చిన డివిడెండ్‌కు ఆదాయపుపన్ను అతని/ఆమె అత్యున్నత ఆదాయపుపన్ను స్లాబ్ ప్రకారం చెల్లించాల్సిన  బాధ్యత పెట్టుబడిదారుకు ఉంటుంది. DDT విధానంలో, డివిడెండ్ ఆప్షన్ ఎంచుకున్న పెట్టుబడిదారులను సమాన పన్ను రేటు ప్రభావితం చేయగా, ఇప్పుడు డివిడెండ్ నుండి వచ్చిన ఆదాయం మీద పన్ను ప్రభావం చూపుతుంది. 20% పన్ను స్లాబ్‌లో ఉన్నవారితో పోల్చితే 30% పన్ను స్లాబ్‌లో ఉన్న పెట్టుబడిదారు ఎక్కువ డివిడెండ్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

ఇంతకు ముందు, గ్రోత్ ఆప్షన్ ఎంచుకున్న పెట్టుబడిదారుపై DDT ప్రభావం ఉండేది కాదు, ఎందుకంటే ఫండ్ సంపాదించిన లాభాలు ఫండ్ అసెట్ బేస్ పెరగడానికి తిరిగి పెట్టుబడి పెట్టబడేవి. ఆవిధంగా, గ్రోత్ స్కీమ్ పెట్టుబడిదారుకు యూనిట్లు అదే సంఖ్యలో ఉంటూ యూనిట్ల NAV ఎక్కువగా ఉండేది, అదే డివిడెండ్ ఆప్షన్ పెట్టుబడిదారులకు డివిడెండ్ ప్రకటించిన తర్వాతి NAV తగ్గిపోయేది. 

మ్యూచువల్ ఫండ్స్ మీద డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రద్దు చేయబడటంతో, ఇప్పుడు గ్రోత్ మరియు డివిడెండ్ ఆప్షన్‌లు రెండింటికీ సమానమైన పంపిణీచేయగల మిగులు ఉంటుంది. ఇంతకు ముందు, మ్యూచువల్ ఫండ్ పన్ను చెల్లించడానికి ఈ మిగులులో కొంత భాగం మూలం నుండి మినహాయించేది, దాంతో డివిడెండ్ ఆప్షన్ పెట్టుబడిదారులకు అందుబాటులో ఉండే పంపిణీ చేయగల నికర మిగులు తగ్గిపోయేది. 

డివిడెండ్ రీఇన్వెస్ట్ ఆప్షన్ పెట్టుబడిదారులు డివిడెండ్‌ను తిరిగి పెట్టుబడి పెట్టడానికి వీలుకల్పించేది, కానీ ఇంతకు ముందు గ్రోత్ ఆప్షన్ పెట్టుబడిదారుల NAV పెరుగుదల కంటే తిరిగి పెట్టుబడి పెట్టిన డివిడెండ్ మొత్తం తక్కువగా ఉండేది, ఎందుకంటే డివిడెండ్లు అన్నీ DDT మినహాయించిన తర్వాతే ప్రకటించబడేవి. ఇప్పుడు గ్రోత్ మరియు డివిడెండ్ ఆప్షన్ మధ్య ఎంచుకోవడం మీ దీర్ఘకాలిక సంపద సృష్టి వర్సెస్ ప్రస్తుత సమయంలో అదనపు ఆదాయ వనరు ఆవసరం మీ ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది.

402