ఒక కారు కొనడం విషయంలో గానీ లేదా ఒకరిని వివాహం చేసుకునే విషయంలో గాని తగినంత ముందస్తు సమాచారం లేకుండా తమ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే రోజులు పోయాయి. అయితే నేడు, సమాచారం మన చేతుల్లోనే అందుబాటులో ఉంది. భోజనానికి ఏమి ఆర్డర్ చేయాలి వంటి చిన్న చిన్న విషయాలు కూడా కొద్దిగా పరిశోధించి లేదా పోల్చి నిర్ణయించుకుంటాం, మ్యూచువల్ ఫండ్స్ అందుకు ఏ మాత్రమూ మినహాయింపు కాదు.
ఫండ్‌లు వాటి క్రింద జాబితా చేయబడిన అన్నీ స్కీంలను పలు కేటగిరీలను నావిగేట్ చేయడం మీకు కష్టంగా అనిపిస్తే, చింతించవలసినది ఏమీ లేదు. ప్రతి కేటగిరీ క్రింద ఉన్న స్కీంల పోలికను ప్రదర్శించే ఒక విశ్వసనీయ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ సవాలును మీరు సులువుగా అధిగమించవచ్చు. గత ప్రదర్శనా తీరులు, ఫండ్ రిస్క్ ప్రొఫైల్, ఫండ్ ఎంతకాలంగా మార్కెట్‌లో ఉంది, దాని పరిమాణం వంటి విషయాలను మీరు చూడవచ్చు.
www.mutualfundssahihai.com/schemeperformance ను సందర్శించి ఒకే చోట అన్నీ స్కీముల ప్రదర్శనా తీరును యాక్సెస్ చేయవచ్చు. ఏ కేటగిరీ కిందనైనా ఉన్న అన్నీ స్కీముల రాబడి కొరకు చూసి, స్కీం ప్రదర్శనా తీరును దాని బెంచ్‌మార్క్ రాబడితో మీరు పోల్చవచ్చు, అదే సమయంలో అదే కేటగిరీలో ఉన్న ఇతర స్కీంలలో అది ఎలా విస్తరించింది అన్నది కూడా మీరు చూడవచ్చు. రెగ్యులర్, డైరెక్ట్ ప్లాన్‌లు రెండింటి కొరకు పలు కాల వ్యవధుల్లో ఫండ్ ట్రాక్ రికార్డును అర్ధం చేసుకునేందుకు ఒక గ్రాఫికల్ ఫార్మాట్‌లో దాని బెంచ్‌మార్క్‌కు ప్రతిగా వాటి గత ప్రదర్శనా తీరులను మీరు ట్రేస్ చేయడం శ్రేష్ఠమైన విషయం.