మీ ఎంపికకు అనుగుణంగా దీర్ఘకాలిక మరియు స్వల్పకాలలిక పెట్టుబడి ప్లాన్లు

Video

మ్యూచువల్ ఫండ్స్ షార్ట్ టర్మ్ పెట్టుబడికి ఆదర్శమైనవా? లేదా లాంగ్ టర్మ్ పెట్టుబడికీ ఆదర్శమైనవా?

మ్యూచువల్ ఫండ్స్ షార్ట్ టర్మ్‌కి కూడా మంచి సేవింగ్ టూల్ కావచ్చు.”

“మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిలతో మీరు ఓపికగా ఉండాలి. మంచి ఫలితాలు రావడానికి సమయం పడుతుంది.”

వ్యక్తులకు క్రమం తప్పకుండా పై వాక్యాలు ఎదురు కావచ్చు, అవి రెండు స్పష్టంగా విరుద్ధంగా ఉన్నాయి.

అయితే మ్యూచువల్ ఫండ్స్ ఎంత కాలపరిమితికి అనువైనవి? షార్ట్ టర్మా లేదా లాంగ్ టర్మా?

అది ఒకరి పెట్టుబడి లక్ష్యాల మీద ఆధారపడి ఉంటుంది, చాలా లక్ష్యాలు సమయాధారితంగా ఉంటాయి. తక్కువ కాలానికి అనువైన స్కీములు ఉన్నాయి, ఎక్కువ కాలానికి అనువైన స్కీములు చాలా ఉన్నాయి, తరువాత వీటి మధ్య ఏ కాలానికైనా స్కీములు ఉన్నాయి.

మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ను లేదా మీ పెట్టుబడి అడ్వైజర్‌ను సంప్రదించండి, మీ ఆర్థిక లక్ష్యాలను, చర్చించండి మరియు తరువాత మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఉదాహరణకు;

  1. ఈక్విటీ-ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్- ఎక్కువ కాలాలకు, సాధారణంగా 5 సంవత్సరాలు మరియు ఆ పైన వాటి కొరకు చూడండి.
  2. ఫిక్సిడ్ ఇన్కం ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ -
    1. లిక్విడ్ ఫండ్స్- చాలా షార్ట్ టర్మ్ కొరకు – 1 సంవత్సరం కన్నా తక్కువ
    2. షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్స్ – మధ్యస్థ కాలానికి – 1 నుండి 3 సంవత్సరాలు.
    3. లాంగ్ టర్మ్ బాండ్ ఫండ్స్ - లాంగ్ టర్మ్ కొరకు– 3 సంవత్సరాలు లేదా ఎక్కువ
       

మీరు మా వెబ్సైట్ని అన్వేషిస్తే, మీరు విభిన్న రకాల మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా తెలుసకోగలరు . మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్/పెట్టుబడి సలహాదారు మీ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి చేసేందుకు సరైన మ్యూచువల్ ఫండ్‌ను గుర్తించడంలో కూడా మీకు సహాయపడతారు!

404

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?