గోల్డ్లో పెట్టుబడి పెట్టడానికి వీలున్నప్పుడు గోల్డ్ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి?

గోల్డ్లో పెట్టుబడి పెట్టడానికి వీలున్నప్పుడు గోల్డ్ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? zoom-icon

ఒక గోల్డ్ ఇటిఎఫ్ ఒక ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఇటిఎఫ్) ఇది డొమెస్టిక్ ఫిజికల్ గోల్డ్ ధరని ట్రాక్ చేసే లక్ష్యాన్ని కలిగి ఉంటుంది. అవి గోల్డ్ ధరలపై ఆధారపడిన మరియు గోల్డ్ బులియన్లో పెట్టుబడి పెట్టడానికి పాసివ్ పెట్టుబడి ఇన్స్ట్రమెంట్లు. ఇండియాలో, గోల్డ్ సాధారణంగా ఆభరణాల రూపంలో ఉంచబడుతుంది, ఇందులో కొంత మేకింగ్ మరియు వేస్టేజ్ కాంపొనెంట్ (సాధారణంగా బిల్ విలువలో 10% పైగా) ఉంటుంది. గోల్డ్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇది తొలగించబడుతుంది.

గోల్డ్ ఇటిఎఫ్‌లు కొనుగోలు చేయడం గోల్డ్‌ని ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు చేయడం అని అర్థం. మీరు స్టాక్స్ ట్రేడ్ చేసినట్లు మీరు గోల్డ్ ఇటిఎఫ్‌లను కొనుగోలు మరియు అమ్మకాలు చేయవచ్చు. మీరు వాస్తవంగా గోల్డ్ ఇటిఎఫ్ రిడీం చేసినప్పుడు, మీరు ఫిజికల్ గోల్డ్‌ను పొందరు, కానీ సమానమైన నగదుని అందుకుంటారు. గోల్డ్ ఇటిఎఫ్‌ల ట్రేడింగ్ ఒక డీమెటీరియలైజ్డ్ అకౌంట్ (డీమాట్) మరియు బ్రోకర్ ద్వారా జరుగుతుంది, ఇది గోల్డ్‌లో ఎలక్ట్రానికల్‌గా పెట్టుబడి పెట్టడానికి అత్యంత సౌకర్యవంతమైన మార్గంగా చేస్తుంది.

దీని డైరెక్ట్ ప్రైసింగ్ వలన, గోల్డ్ ఇటిఎఫ్ హోల్డింగ్స్ పైన పూర్తి పారదర్శకత ఉన్నది. ఇంకా దీని ప్రత్యేకమైన నిర్మాణం మరియు క్రియేషన్ మెకానిజం వలన, ఫిజికల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లతో పోల్చితే ఇటిఎఫ్లకు చాలా తక్కువ ఖర్చులు ఉంటాయి.

404

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?