ఇటిఎఫ్ అంటే ఏమిటి?

Video

ఇటిఎఫ్ అంటే ఎక్స్‌ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ అని అర్థం, ఇది రెగ్యులర్ మ్యూచ్‌‌వల్ ఫండ్ లాగా కాకుండా స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో సామాన్య స్టాక్ లాగా ట్రేడ్ చేస్తుంది.

ఇటిఎఫ్ యూనిట్లు సాధారణంగా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్‌ఛేంజ్ రిజిస్టర్డ్ బ్రోకర్ ద్వారా కొనుగోలు మరియు అమ్మకం చేయబడతాయి. ఇటిఎఫ్ యూనిట్లు స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో లిస్ట్‌ చేయబడతాయి మరియు మార్కెట్ కదలికలను బట్టి ఎన్ఎవి మారుతుంది. ఇటిఎఫ్ యూనిట్లు స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో మాత్రమే లిస్ట్‌ చేయబడతాయి కావున, ఏదైనా సాధారణ ఓపెన్ ఎండ్ ఈక్విటీ ఫండ్ లాగా కొనుగోలు లేదా అమ్మకం చేయబడవు. ఇన్వెస్టర్‌ ఎక్స్‌ఛేంజ్ ద్వారా ఎటువంటి పరిమితి లేకుండా ఆమె కొరుకున్న యూనిట్లను కొనుగోలు చేయవచ్చు.

సులువైన పదాలలో, ఇటిఎఫ్‌లు సిఎన్ఎక్స్, నిఫ్టీ లేదా బిఎస్ఇ సెన్సెక్స్ మొదలగు సూచీలను ట్రాక్ చేసే ఫండ్స్. మీరు ఒక ఇటిఎఫ్ యొక్క షేర్లు/యూనిట్లు కొనుగోలు చేసినప్పుడు, మీరు దాని స్వంత సూచిక యొక్క ఫలం మరియు రిటర్నును ట్రాక్ చేసే షేర్లు/యూనిట్లు కొనుగోలు చేస్తారు. ఇటిఎఫ్‌లు మరియు ఇతర రకాల ఇండెక్స్ ఫండ్స్ మధ్య ముఖ్య తేడా ఇటిఎఫ్‌లు వాటి అనురూప ఇండెక్స్ కన్నా మించి పనితీరుని చూపవు, కానీ ఇండెక్స్ పనితీరుని మాత్రమే ప్రతిబింబిస్తాయి. అవి మార్కెట్‌ని అధిగమించాలని ప్రయత్నించవు, అవి మార్కెట్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాయి.

ఇటిఎఫ్‌లు ప్రత్యేకంగా అధిక డైలీ లిక్విడిటీని కలిగి ఉంటాయి మరియు మ్యూచ్‌‌వల్ ఫండ్స్ స్కీముల కన్నా తక్కువ ఫీజుతో, వ్యక్తిగత ఇన్వెస్టర్ల‌కు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా చేస్తాయి.

402

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?