మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఉండే పన్ను నియమాలు మరియు నిబంధనలు ఏవి?

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఉండే పన్ను నియమాలు మరియు నిబంధనలు ఏవి? zoom-icon

మ్యూచువల్‌ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు క్యాపిటల్ గెయిన్స్ టాక్స్‌కి లోబడి ఉంటాయి. మనం చేసిన లాభం పైన మన మ్యూచువల్‌ ఫండ్ హోల్డింగ్స్ (యూనిట్ల) రిడీమ్ చేస్తున్నప్పుడు/అమ్మతున్నప్పుడు దీనిని చెల్లించాలి. లాభం విలువ నికర ఆస్తి విలువ (ఎన్ఎవి) అమ్మకం తేదీ మరియు కొనుగోలు తేదీ (అమ్మకం ధర - కొనుగోలు ధర) లో తేడా. క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ హోల్డింగ్ కాలాన్ని బట్టి కూడా వర్గీకరించబడుతుంది. ఈక్విటీ ఫండ్స కొరకు (ఈక్విటీ ఎక్స్‌పోజర్‌లో ఉన్న ఫండ్స్) > =65%), హోల్డింగ్ కాలం సంవత్సరం లేదా మరింత కాలం, దీర్ఘ కాలంగా పరిగణించబడుతుంది మరియు దీర్ఘ కాల క్యాపిటల్ గెయిన్స్ (ఎల్‌టిసిజి) కి లోబడి ఉంటాయి.

ఆర్థిక సంవత్సరంలో క్యుమిలేటివ్ క్యాపిటల్ గెయిన్ రూ 1 లక్ష మించితే ఈక్విటీ ఫండ్స్ పైన 10% ఎల్‌టిసిజి వర్తిస్తుంది. ఆర్థిక ప్రణాళిక చేస్తున్నప్పుడు రూ. 1 లక్ష వరకు మీ గెయిన్స్ పన్ను రహితం అని గుర్తుంచుకోండి. ఇది 31 జనవరి 2018 తరువాత చేసిన అన్ని పెట్టుబడులకు వర్తిస్తుంది. ఈక్విటీ ఫండ్స్‌లో సంవత్సరం కన్నా తక్కువగా ఉన్న హోల్డింగ్స్ పైన లాభాలు 15% షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్‌టిసిజి) పన్నుకు లోబడి ఉంటాయి.

దీర్ఘ కాలం అంటే నాన్-ఈక్విటీ ఫండ్ (డెబిట్ ఫండ్) విషయంలో 3 సంవత్సరాలు లేదా ఎక్కువ మరియు అట్టి హోల్డింగ్స్ పైన 20% ఎల్‌టిసిజి టాక్స్ ఇండెక్సేషన్‌తో అంటే, క్యాపిటల్ గెయిన్స్ లెక్కిస్తున్నప్పుడు ద్రవ్యోల్బణానికి ధర పెంచి సవరించబడుతుంది. 3 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్న హోల్డింగ్స్ పైన లాభాలు ఎస్‌టిసిజి పన్నుకు లోబడి ఉంటాయి, ఇందులో అత్యధిక ఆదాయ పన్ను స్లాబ్ లోకి వచ్చే వ్యక్తులు ఉంటారు.

403

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?