మ్యూచువల్ ఫండ్స్లో ఒడిదుడుకులు ఎందుకు పట్టించుకోకూడదు?

Video

చాలా దూరం డ్రైవ్ చేసే సమయంలో, మీ స్పీడ్ లేదా గమ్యం మరియు అక్కడకు ఎలా చేరాలి అనేదాన్ని గురించి మీరు ఆందోళన చెందుతారా? మీరు స్పష్టంగా ఎగుడుదిగుడులను లెక్కించరు, కేవలం సురక్షితంగా సకాలంలో మీ గమ్యం చేరడం మీద దృష్టి పెడతారు. మ్యూచువల్ ఫండ్స్ విషయంలో కూడా అంతే. రోజువారీ NAV హెచ్చుతగ్గుల గురించి మీరు ఆందోళన చెందకూడదు, దానికి బదులు మీరు దాని కోసం నిర్ణయించుకున్న సమయంలో ఆర్థిక లక్ష్యాలకు దగ్గరగా అది తీసుకెళ్తుందా అనేదానిపై దృష్టి పెట్టాలి. 

చాలా దూరం డ్రైవ్ చేసే సమయంలో, మీ స్పీడ్ సున్నాకు పడిపోయిన అనేక సందర్భాలు ఉంటాయి, కానీ ఎగుడుదిగుడులు దాటగానే వాహనం తిరిగి స్పీడ్ పుంజుకుంటుంది మరియు మీ ప్రయాణం కొనసాగుతుంది. ప్రయాణం ముగింపులో, మీ గమ్యం చేరడానికి మీరు తీసుకున్న సగటు సమయం మాత్రమే లెక్కలోకి వస్తుంది. అదేవిధంగా, ఒక మ్యూచువల్ ఫండ్ స్వల్పకాలంలో అనేక ఒడిదుడుకులు పొందవచ్చు, కానీ ఎంత దీర్ఘకాలం మీరు పెట్టుబడిని కొనసాగిస్తే అంతగా ఈ ఒడిదుడుకుల ప్రభావం తగ్గుతుంది మరియు మీరు ఒక సానుకూల రాబడి సంపాదించే అవకాశాలు చాలా దూరం ప్రయాణం చేసిన సమయంలో కారు సగటు స్పీడ్ లాగా పైకి వెళ్తాయి.  

ప్రతి ఎకానమీ మరియు దాని వలన మార్కెట్ పెరుగుదల మరియు తగ్గుదల కాలాలకు గురి అవుతాయి, ఇది మీ ఫండ్ రాబడిని ప్రభావితం చేస్తుంది కానీ స్పల్ప-కాలంలో మాత్రమే. దీర్ఘ-కాలంలో, మీ ఫండ్ అలాంటి ఎన్నో హెచ్చుతగ్గుల గుండా ప్రయాణం చేస్తుంది, కానీ వాటి ప్రభావం తగ్గిపోతుంది, ఎందుకంటే మీ పెట్టుబడి ప్రయాణం ముగింపులో దీర్ఘ-కాలంలో కాపౌండ్ అయిన మొత్తం రాబడి లెక్కలోని వస్తుంది.

402

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?