ఒక మ్యూచువల్ ఫండ్ స్కీములో ఉన్న అతి పెద్ద ప్రయోజనాలలో ఒకటి లిక్విడిటీ, అంటే పెట్టుబడిని నగదుగా మార్చుకునే సౌలభ్యత.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీములు (ఇఎల్ఎస్ఎస్), సెక్షన్ 80 సిసి క్రింద పన్ను ప్రయోనాలను అందించే వాటికి, 3 సంవత్సరాల కాలంలో ‘లాక్ ఇన్’ యూనిట్లకు నియంత్రణ అవసరము ఉంటుంది, ఆ తరువాత వాటిని ఉచితంగా రిడీం చేసుకోవచ్చు
ప్రాముఖ్యంగా “ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్” (ఎఫ్ఎమ్పిలు) అని పిలువబడే స్కీముల ఇంకొక వర్గం ఉన్నది, ఇందులో పెట్టుబడిదార్లు ఒక నిర్దిష్ట కాలానికి పెట్టుబడి చేయవచ్చు, ఇది స్కీము ఆఫర్ డాక్యుమెంటులో ముందుగా నిర్వచించబడి ఉంటుంది. ఈ స్కీముల వ్యవధి మూడు నెలల నుండి కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది.
అయితే కొన్ని ఓపెమ్ ఎండ్ స్కీములు, ఎగ్జిట్ లోడ్ కాలాన్ని తెలుపుతాయి. ఉదాహరణకు, ఒక స్కీము యూనిట్లను 6 నెలలలో రిడీం చేసుకున్నట్లయితే వర్తించగల NAV వద్ద ఒక ఎగ్జిట్ లోడ్ 0.50% తెలపవచ్చు.
కనీస కాల పరిమితి మీద కొన్ని నియమనిబంధనలు ఉండ వచ్చని గుర్తుంచుకోవాలి. కాబట్టి, ప్రతి స్కీమ్ రకానికి తగిన లేదా ఉత్తమమైన కాల పరిమితులను తెలుసుకునేందుకు ఒక ఆర్థిక సంబంధిత నిపుణుడి సలహాను తీసుకోవడం మంచిది.