మ్యూచువల్ ఫండ్ విభిన్న అసెట్ విభాగాలలో, స్కీము ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ (ఎస్ఐడి) ప్రకారం ఇన్వెస్ట్ చేస్తుంది. ఒక స్కీము కొరకు ప్రతిపాదిత అసెట్ కేటాయింపు సాధారణ ఉదాహరణలు ఇవి కావచ్చు:
- ఒక ఈక్విటీ ఫండ్ 80% నుండి 100% ఈక్విటీలో; 0% నుండి 20% మనీ మార్కెట్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టవచ్చు
- సమతుల్య నిధి అసెట్ కేటాయింపు ఈక్విటీలో 65% నుండి 80%; డెబిట్ సెక్యూరిటీలలో 15% నుండి 35%; మనీ మార్కెట్ సెక్యూరిటీలలో 0% నుండి 20% లాగా ఉండవచ్చు
చాలా సందర్భాలలో, అసెట్ వర్గంలో కేటాయింపు ఒక రేంజిగా తెలుపబడుతుంది. ఎస్ఐడిలొ చూపబడిన పరిమితిని దాటి ఫండ్ మేనేజర్ అసెట్ కేటాయింపుని మార్చలేరు, కానీ ఇవ్వబడ్డ హద్దుల లోపల మార్చడానికి అనుమతించబడుతుంది. ఉదాహరణకి, ఈక్విటీతో, లార్జ్ క్యాప్ మరియు మిడ్ క్యాప్ కంపెనీల మధ్య కేటాయింపు పైన తెలుపబడలేదు, ఇది లార్జ్ క్యాప్ మరియు మిడ్ క్యాప్ మధ్య కేటాయింపుని విభిన్న సమయాలలో నిర్వహించడానికి ఫండ్ మేనేజర్‌కు అనుకూలతకు వీలుకల్పిస్తుంది.
స్కీము యొక్క అసెట్ కేటాయింపులో మార్పు చేయాల్సి ఉంటే, ఫండ్ మేనేజిమెంట్ కంపెనీ తప్పక ఫండ్ ట్రస్టీలు మరియు ప్రస్తుం ఉన్న యూనిట్ హోల్డర్ల ఆమోదాన్ని పొందాలి. ప్రతిపాదిత మార్పును కంపెనీ పబ్లిక్‌లో కూడా ప్రకటించాలి. ప్రస్తుతం ఉన్న ఇన్వెస్టర్లు అందరూ, ఎటువంటి ఎగ్జిట్ లోడ్, ఏదైనా ఉంటే, చెల్లించకుండా 30 రోజుల వరకు స్కీము నుండి ఎగ్జిట్ కావచ్చు.