కొందరు వ్యక్తులు రెగ్యులర్ ఆదాయంగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు మరియు సాధారణంగా డివిడెండ్పొం దే ఎంపికల గురించి చూస్తారు. అలా చాలా స్కీములు, ప్రత్యేకించి డెబిట్ ఓరియెంటెడ్ స్కీములకు, నెలవారీ లేదా త్రైమాసిక డివిడెండ్ ఎంపికలు ఉంటాయి. డెవిడెండ్లు స్కీము ద్వారా చేయబడిన లాభాల నుండి పంచబడతాయని మరియు ప్రతి నెలా ఎటువంటి హామీ ఇవ్వబడదని గమనించడం ముఖ్యం. ఫండ్ హౌసెస్ స్థిరమైన డివిడెండ్లు ఇవ్వడానికి ప్రయత్నించినా, పంపిణీ చేయవలసిన మిగులు మార్కెట్ కదలికలు మరియు ఫండ్ పనితీరుని బట్టి నిర్ధారించబడుతుంది.
నెలవారీ ఆదాయం పొందడానికి ఇంకొక మార్గం ఉన్నది: సిస్టమాటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (ఎస్ డబ్లుపి) ఉపయోగించి.. ఇక్కడు, మీరు ఒక స్కీము గ్రోత్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తారు మరియు నెలవారీ చెల్లింపుగా కావలసిన ఒక నిర్దిష్ట మొత్తాన్ని తెలియజేస్తారు. తరువాత నియమింపబడిన తేదీ నాడు, ఆ ఫిక్సిడ్ మొత్తానికి యూనిట్లు రిడీం అవుతాయి. ఉదాహరణకి, ఒక ఇన్వెస్టర్ రూ. 10 లక్షలని ఇన్వెస్ట్ చేసి మరియు రూ. 10,000 ప్రతి నెల 1వ తేదీ నాడు చెల్లించాలని అభ్యర్థించవచ్చు. అప్పుడు యూనిట్లు విలువ రూ. 10,000 ప్రతి నెల 1వ తేదీ నాడు రిడీం అవుతాయి.
డెవిడెండ్ మరియు ఎస్డబ్ల్యుపిలు రెండింటికి టాక్స్ ట్రీట్మెంట్ మారుతుందని మరియు ఇన్వెస్టర్లు దాని ప్రకారం ప్లాన్ చేసుకోవడం ముఖ్యం.
*నెలవారీ ఆదాయం హామీ ఇవ్వబడదు మరియు భవిష్యత్తు రిటర్నులుగా అన్వయించకూడదు.