ESG అంటే ఎన్విరాన్మెంటల్, సోషల్ మరియు గవర్నెన్స్. ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఎక్కువ భాగం పర్యావరణ, సామాజిక మరియు గవర్నెన్స్ కోసం మదింపు చేసిన కంపెనీల షేర్లు మరియు బాండ్లు కలిగి ఉంటాయి. అటువంటి పెట్టుబడులను ఎంచుకోవడం ద్వారా, మీరు స్థిరమైన వృద్ధిని మరియు బాధ్యతాయుతమైన వ్యాపార ప్రవర్తనను క్రియాశీలకంగా ప్రోత్సహిస్తారు.
ESG వివరణ
ఎన్విరాన్మెంటల్ (ఇ):కార్బన్ ఉద్గారాలు, వ్యర్థాల పారవేసే పద్ధతులు, పర్యావరణ అనుకూల ఇంధన వనరుల వినియోగంతో సహా కంపెనీ యొక్క పర్యావరణ ప్రభావంపై 'ఇ' దృష్టి సారిస్తుంది.
సామాజిక (ఎస్): లింగ సమానత్వం, సంక్షేమ వ్యవస్థలు మరియు సామాజిక కారణాలను పరిగణనలోకి తీసుకొని ఒక కంపెనీ తన శ్రామిక శక్తితో ఎలా వ్యవహరిస్తుందో మరియు సమాజానికి ఎలా దోహదం చేస్తుందో 'ఎస్' పరిశీలిస్తుంది.
గవర్నెన్స్ (జి): కార్పొరేట్ గవర్నెన్స్, రెగ్యులేటరీ కాంప్లయన్స్, విజిల్ బ్లోయర్ విధానాలు, ఫిర్యాదుల పరిష్కారాలను 'జి' అంచనా వేస్తుంది.
ESG ఫండ్స్ ఈ రంగాలలో రాణించే కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి ప్రాధాన్యమిస్తుంది. ఈఎస్జి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టడానికి ముందు కంపెనీ యొక్క పర్యావరణ, సామాజిక మరియు పాలనా పద్ధతులను అంచనా వేయడానికి ఈఎస్జి రేటింగ్ؚలను ఉపయోగిస్తాయి. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, ఈ రేటింగ్ؚలను థర్డ్ పార్టీ రేటింగ్ ఏజెన్సీలు
మరింత చదవండి