ఒక మ్యూచువల్ ఫండ్ స్కీంలో రిస్కును సూచించేవి ఏవి?

ఒక మ్యూచువల్ ఫండ్ స్కీంలో రిస్కును సూచించేవి ఏవి? zoom-icon

మీరు కష్టపడి సంపాదించిన నగదును పెట్టుబడి పెట్టేందుకు సరైన మ్యూచువల్ ఫండ్ స్కీంను ఎంచుకోవడానికి ముందు మీరు సరిగ్గా మూల్యాంకనం చేయడం తప్పనిసరి. మదుపరులు తరచుగా స్కీం వర్గం మరియు ఆ వర్గంలో బాగా పెర్ఫార్మ్ చేసే స్కీంల వైపు మొగ్గుచూపేటపేపుడు, ఆయా స్కీంల కొరకు గల రిస్క్ సూచీలను వారు పట్టించుకోరు. మీరు ఎంచుకోదలచుకున్న స్కీంలను మీరు పోల్చేటప్పుడు వాటి రిస్క్ తీవ్రతను పోల్చడం మర్చిపోకండి. ప్రతి స్కీం యొక్క ఫ్యాక్ట్షీట్లో స్టాండర్డ్ డీవియేషన్, బీటా, షార్ప్ రేషియో వంటి పలు రిస్క్ సూచీలు అందించగా, ఉత్పత్తి లేబుల్ అనేది పరిశీలించవలసిన అత్యంత ప్రాథమిక అంశం. లేబుల్లోని రిస్కోమీటరు, ఆ ఫండ్ యొక్క రిస్క్ స్థాయిని చూపిస్తుంది. ఈ రిస్కోమీటర్‌ను సెబీ తప్పనిసరి ఆవశ్యకంగా చేసింది,  ఇది ఫండ్‌కు సంబంధించి మూలాధార రిస్క్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. తక్కువ, తక్కువ నుండి ఒక మోస్తరు, ఒక మోస్తరు, ఒక మోస్తరు ఎక్కువ, ఎక్కువ మరియు చాలా ఎక్కువ అనే ఆరు రిస్క్ స్థాయిలు వివిధ కేటగిరీలకు మ్యూచువల్ ఫండ్స్‌కు వాటి పోర్ట్‌ఫోలియో ఉన్న రిస్క్ స్థాయి ఆధారంగా లింక్ చేయబడ్డాయి. ఈ రకమైన రిస్క్ వర్గీకరణను సెబీ నిర్వచించింది కాబట్టి, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ అలాంటి రకాల ఫండ్స్‌ను అదే రిస్క్ కేటగిరీలోకి తప్పనిసరిగా వర్గీకరణ చేయాలి.

ఫండ్ రిస్క్ అవలోకనం ఇచ్చే రిస్కోమీటర్‌తోపాటుగా, ఫ్యాక్ట్ షీట్‌లో ఇవ్వబడ్డ మరింత నిర్ధిష్ట రిస్క్ ఇండికేటర్‌లను కూడా చూడవచ్చు. ఒక ఫండ్ యొక్క రాబడి శ్రేణిని స్టాండర్డ్ డీవియేషన్ కొలుస్తుంది. అత్యధిక స్టాండర్డ్ డీవియేషన్తో రాబడిని కలిగిన స్కీం, దాని పెర్ఫార్మెన్స్ శ్రేణి విస్తారమైనదని సూచిస్తుంది, అధిక చంచలతను ఇది సూచిస్తుంది. 

మార్కెట్ పరంగా ఒక ఫండ్ అస్థిరత్వాన్ని బేటా కొలుస్తుంది. మార్కెట్ కంటే ఫండ్ ఎక్కువ అస్థిరంగా ఉందని బీటా >1 సూచిస్తుంది మరియు బీటా <1 అంటే అది మార్కెట్ కంటే తక్కువ అస్థిరంగా ఉందని అర్థం. స్కీమ్ మార్కెట్ అస్థిరత్వానికి అనుగుణంగా కదులుతుందని 1 యొక్క బీటా సూచిస్తుంది. 

ఒక్కో యూనిట్‌కు తీసుకున్న రిస్క్‌కు ఫండ్ ఇచ్చే అదనపు రాబడిని షార్ప్ రేషియో కొలుస్తుంది.ఇది రిస్క్-అడ్జెస్టెడ్ రాబడికి మంచి సూచిక.

ఏ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలని ఈసారి పరిశోధించేటప్పుడు, పై రిస్క్ పారామీటర్ల ఆధారంగా వాటిని మూల్యాంకనం చేయడం మరచిపోకండి.

407
481

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?