టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్లు అంటే ఏమిటి?

టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్లు అంటే ఏమిటి? zoom-icon

మ్యూచువల్ ఫండ్ల గురించి పెరుగుతున్న అవగాహన మరియు గ్యారెంటీ పొదుపు ఉత్పత్తులపై పడిపోతున్న వడ్డీ రేట్లతో, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, PPFలు మరియు NSCలు లాంటి సాంప్రదాయ ఉత్పత్తులకు అలవాటు పడిన చాలా మంది రిస్క్ కోరుకోని పెట్టుబడిదారులు సముచితమైన కారణాల వల్ల డెట్ ఫండ్ల వైపు మళ్ళారు. అధిక ప్రజాదరణగల ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే, డెట్ ఫండ్లలో తక్కువ అస్థిరత ఉందని మరియు వారి ఫిక్స్డ్ డిపాజిట్లు, PPFలు మరియు NSCల కంటే మెరుగైన రాబడి ఇచ్చే సామర్థ్యంతో, వాటి కంటే ఇవి ఎక్కువ పన్ను ప్రయోజనం కలిగి ఉన్నాయని అలాంటి పెట్టుబడిదారులు తెలుసుకున్నారు. అయినప్పటికీ, పెట్టుబడిదారులు ఇప్పటికీ డిఫాల్ట్ రిస్క్కు, అంటే అసలు మరియు వడ్డీ చెల్లింపులను కోల్పోయే రిస్క్కు మరియు వడ్డీ రేటు రిస్క్కు, అంటే వడ్డీ రేట్లలో మార్పుల కారణంగా ధర హెచ్చుతగ్గులకు గురి అవుతున్నారు.

టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్లు (TMFలు) తమ పోర్ట్ఫోలియోను ఫండ్ మెచ్యూరిటీ తేదీతో సమన్వయపరచడం ద్వారా డెట్ ఫండ్లకు సంబంధించిన రిస్క్లను మెరుగ్గా నావిగేట్ చేయడంలో పెట్టుబడిదారులకు సహాయపడతాయి. ఇవి అంతర్గత బాండ్ ఇండెక్స్ను ట్రాక్ చేసే ప్యాసివ్ డెట్ ఫండ్లు. ఈవిధంగా, అటువంటి ఫండ్ల పోర్ట్ఫోలియోలో అంతర్గత బాండ్ ఇండెక్స్లో భాగమైన బాండ్లు

మరింత చదవండి