సంయోజిత వార్షిక ఎదుగుదల రేటు (CAGR) అనేది విస్తృతంగా ఉపయోగించే రాబడి మెట్రిక్ ఎందుకంటే ఇది ఏడాది ఏడాదికి ఒక పెట్టుబడి పొందే రాబడిని వాస్తవంగా పరిగణిస్తుంది, అయితే ఇందుకు విరుద్ధంగా నిరపేక్ష రాబడిలో ఐతే రాబడిని సంపాదించడానికి తీసుకున్న సమయాన్ని పరిగణించకుండా ఒక పెట్టుబడి నుండి (పాయింట్ టు పాయింట్) నేరుగా రాబడిని పరిగణిస్తుంది.
CAGR కు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అంటే ఆరంభంలో చేసిన పెట్టుబడి మొత్తం, పెట్టుబడి అంతిమ విలువ, గడిచిన కాల వ్యవధి ఆధారంగా ఒక పెట్టుబడి పొందే సగటు వార్షిక ఆదాయాన్ని అందించడం ద్వారా వివిధ ఆస్తి వర్గాల వ్యాప్తంగా రాబడులను పోల్చేందుకు అనుమతిస్తుంది. 5 సంవత్సరాల క్రితం చేసిన రూ.1000ల పెట్టుబడి విలువ నేడు రూ.1800 విలువ కలిగి ఉంటే, నిరపేక్ష ఎదుగుదల రేటు 80% ఉండగా, ప్రతి సంవత్సరం పెట్టుబడి సంపాదించిన సగటు రాబడి దాని CAGR అవుతుంది. CAGR 12.5% ఉండేలా గణించబడింది. 12.5% వార్షికంగా హామీ ఇచ్చిన బ్యాంకు ఎఫ్‌డితో గనక దీన్ని మీరు పోల్చవలసి వస్తే, CAGR సులువుగా ఉంటుంది.
అలానే, వార్షిక ద్రవ్యోల్బణం 4% అనుకుందాం, దానిని తొలగించిన తరువాత మీ పెట్టుబడి ద్వారా సంపాదించిన రాబడిని మీరు లెక్కగట్టవలసి వస్తే,
మరింత చదవండి