హైబ్రిడ్ ఫండ్ అంటే ఏమిటి?

Video

మనం భోజనం చేస్తున్నప్పుడు మన భోజనాల ఎంపిక ఉన్న సమయం పైన, సందర్భం మరియు మూడ్ని బట్టి కూడా ఎక్కువగా ఆధారపడుతుంది. మనం త్వరగా వెళ్ళాలనుకుంటే, ఉదాహరణకు ఆఫీసు లంచ్ సమయంలో లేదా బస్సు/రైలు ఎక్కే ముందు తినాలంటే, మనం కాంబో భోజనాన్ని ఎంచుకోవచ్చు. లేదా కాంబో భోజనం ప్రాచుర్యం అని మనకు తెలిస్తే, మనం మెనూని చూడకపోవచ్చు. తీరికగా తీసుకునే భోజనం మెనూలో ఐటంలను విడిగా, మనకి నచ్చినన్ని ఆర్డర్ చేయడం అని అర్థం.

అలాగే, ఒక ఇన్వెస్టర్ విభిన్న స్కీములను ఎన్నుకుని మరియు ఇన్ వెస్ట్ చేయవచ్చు, ఉదా. ఈక్విటీ ఫండ్, డెబిట్ ఫండ్, గోల్డ్ ఫండ్, లిక్విడ్ ఫండ్, మొదలగునవి. అదే సమయంలో, ఒక కాంబో భోజనం లాగా- హైబ్రిడ్ స్కీములు అనే స్కీములు ఉన్నాయి. ఈ హైబ్రిడ్ స్కీములను గతంలో సమతుల్య నిధులు అని పిలిచేవారు, రెండు లేదా అంతకంటే ఎక్కువ అసెట్ విభాగాలలో పెట్టుబడి పెట్టి తద్వారా ఇన్వెస్టర్ రెండింటి లాభాలను వినియోగించుకోవచ్చు. ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో విభిన్న రకాల హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. ఈ స్కీములు రెండు అసెట్లలో అంటే, ఈక్విటీ మరియు డెబిట్ లేదా డెబిట్ మరియు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీ, డెబిట్ మరియు గోల్డ్లో కూడా ఇవ్వెస్ట్ చేసే స్కీములు కూడా ఉన్నాయి. అయితే, చాలా ప్రాచుర్యం పొందిన హైబ్రిడ్ స్కీములు ఈక్విటీ మరియు డెబిట్ అసెట్లలో ఇన్వెస్ట్ చేస్తాయి.

విభిన్న రకాల హైబ్రిడ్ ఫండ్స్ విభిన్న సెట్ కేటాయింపు వ్యూహాలను అనుసరిస్తాయి. మీరు పెట్టుబడి పెట్టడానికి ముందు మీ ఉద్దేశ్యాలు స్పష్టంగా ఉండాలని గుర్తుంచుకోండి.

420