మనీ మార్కెట్ ఫండ్‌లు అనేవి ఒక రకమైన మ్యూచువల్ ఫండ్, ఇది ప్రధానంగా ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే మనీ మార్కెట్ సాధనాలలో పెట్టుబడి పెడుతుంది. మనీ మార్కెట్ అంటే చాలా స్వల్పకాలిక స్థిరాదాయ సాధనాలతో వ్యవహరించే ఆర్థిక మార్కెట్. మనీ మార్కెట్ ఫండ్‌ల సాధారణ భాగస్వాములు బ్యాంకులు, సంస్థాగత పెట్టుబడిదారులు, కార్పొరేషన్‌లు, ఇతర ఆర్థిక సంస్థలు మరియు మరెన్నో.
మనీ మార్కెట్ ఫండ్ ముఖ్యంగా తక్కువ పెట్టుబడి వ్యవధి, అధిక లిక్విడిటీ, తక్కువ వడ్డీ రేట్లు మరియు సాపేక్షంగా తక్కువ రాబడులు వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.
మనీ మార్కెట్ ఫండ్‌లు 1 సంవత్సరం లేదా అంతకంటే తక్కువ కాలానికి సెక్యూరిటీలలో పెట్టుబడి పెడతాయి కాబట్టి, మంచి రాబడిని సంపాదించడానికి మరియు రిస్క్‌ను అదుపులో ఉంచడానికి కాలవ్యవధిని సవరిస్తూ ఉంటాయి.
అంతేకాకుండా, ఈ ఫండ్‌లు ఇతర మ్యూచువల్ ఫండ్‌ల విధంగానే పనిచేస్తాయి, అయితే ఋణ వ్యవధి సర్దుబాట్ల ద్వారా రిస్క్‌లను అదుపులో ఉంచుతూ ఫండ్ మేనేజర్ అధిక రాబడిని అందించగలిగేలా వీటిని రూపొందించారు.
మనీ మార్కెట్ ఫండ్ ప్రాథమిక లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
మెచ్యూరిటీ కాలపరిమితి తక్కువగా ఉంటుంది: ఫండ్ విభాగాన్ని బట్టి మనీ మార్కెట్ ఫండ్‌లు ఒక రోజు నుండి ఏడాది వరకు ఉంటాయి.
ఇవి
మరింత చదవండి