ఒక కొత్త పెట్టుబడిదారు ఏ ఫండ్లలో పెట్టుబడి చేయాలి?

Video

దీర్ఘ కాలంలో ఇతర అసెట్ తరగతుల కన్నా మెరుగైన రాబడులను ఉత్పన్నం చేయగల వారి సామర్ధ్యం కొరకు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు, అయితే ఎక్కడ మొదలుపెట్టాలి అన్నది మాత్రం వారికి తెలియదు. మ్యూచవల్ ఫండ్స్ రిస్కీ కాబట్టి, చాలా మంది తమ కష్టార్జితాన్ని దానిలో ఆదా చేసేందుకు వెనకాడతారు. రిస్కు లేకుండా మ్యూచువల్ ఫండ్ల ప్రయోజనాలను వారికి అందించగల ఎటువంటి ఫండ్లలో తాము పెట్టుబడి చేయాలి అన్నది కనుగొనేందుకు వారు నిరంతరం పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఎటువంటి ఉచిత లంచ్‌లు ఉండవు కాబట్టి, ఇతర మ్యూచువల్ ఫండ్ల లాగా మనకు ఆదాయాలను ఇచ్చే జీరో-రిస్క్ ఫండ్లు మనకు లేవు. కానీ ఓవర్‌నైట్ ఫండ్లు వీటికి దగ్గరగా ఉంటాయి.

ఈ ఫండ్లు మరుసటి రోజున మెచూర్ అయ్యే సెక్యూరిటీలలో పెట్టుబడి చేస్తాయి. కాబట్టి, అవి అధికంగా ద్రవ్య రూపంలో ఉండి, కనిష్ట రిస్కును కలిగి ఉంటాయి. అయితే, ఈ ఫండ్ల ద్వారా దీర్ఘకాలంలో మీకు సేవ అందించేందుకు మీ పోర్ట్‌ఫోలియో కొరకు మీకు కావలసినంత రాబడిని ఉత్పన్నం చేయడం కష్టం. మీరు జీవితాంతం కష్టపడి సంపాదించి, ఆదా చేసిన దాన్ని మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టడానికి ముందు, చిన్న తరహాలో మ్యూచువల్ ఫండ్లను ప్రయత్నించడానికి మీరు చూస్తుంటే, ఓవర్‌నైట్ ఫండ్లు దానికి సమాధానం. అయితే, కొద్ది కాలం పాటు ఒక పెద్ద మొత్తంలో నగదును మీరు ఉంచాలనుకుంటున్నా లేదా మ్యూచువల్ ఫండ్లను ఒక పెట్టుబడి ఆప్షన్‌గా వాటితో సౌకర్యవంతంగా ఉండేందుకు చూస్తుంటే మాత్రమే, ఈ ఫండ్లను ఉపయోగించండి. మ్యాచ్‌కు వెళ్ళడానికి ముందు క్రికెటర్లకు నెట్ ప్రాక్టీస్ సెషన్లు ఎలాగో ఇవి కూడా అలాగే ఉంటాయి.

402

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?