మ్యూచువల్ ఫండ్స్ నుండి రిటర్నులు, అది ఇన్వెస్ట్ చేసే రకం మరియు అ ఇన్వెస్ట్మెంట్లకి సంబంధించిన రిస్కులను బట్టి ఉంటాయి. కేకు రుచి సమోసా కన్నా వేరుగా ఉంటుంది ఎందుకంటే రెండింటిని చేయడానికి విభిన్న పదార్థాలు మరియు తయారీలో పద్దతులు వేరుగా ఉంటాయి. అదే విధంగా, ఈక్విటీ మరియు స్థిర ఆదాయ పండ్స్ విభిన్న రకాల రిటర్నులను అందిస్తాయి ఎందుకంటే వాటి పోర్ట్ఫోలియోలు వాటి రిటర్నులను అందించే సెక్యూరిటీల రకం మరియు ఈ సెక్యూరిటీలు ఆదాయాన్ని తెచ్చే మార్గాలు వేరుగా ఉంటాయి.
స్థిర ఆదాయ ఫండ్స్ బాండ్లు, డిబెంచర్లు మరియు మనీ మార్కెట్ ఇన్స్ట్రమెంట్స్ లాంటి వడ్డీ చెల్లించే సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ సెక్యూరిటీలు ఈ మ్యూచువల్ ఫండ్స్కు క్రమమైన అంతరాలలో స్థిరమైన వడ్డీని అందిస్తాయని హామీ ఇస్తాయి. మార్కెట్లో ఉన్న రుణ వడ్డీకి దాదాపు సమీపంగా రేటు ఉంటుంది. ఈ సెక్యూరిటీలను జారీ చేసే వారు వారి హామీని నిర్వర్తించడంలో విఫలం అవుతారు కావున, అట్టి ఇన్వెస్టమెంట్లలో రిస్కు పరిహారంగా ప్రస్తుత రుణ రేట్ల కన్నా కొంచెం ఎక్కువ వడ్డీని చెల్లించడానికి వారు హామీని ఇస్తారు. బాగా స్థిరపడ్డ ఒక కంపెనీ రూకీ కంపెనీతో పోల్చితే తన బాండ్ల పైన తక్కువ వడ్డీని అందించవచ్చు (తక్కువ రిస్కు ప్రీమియం) ఎందుకంటే వారి బాండ్లకు నూతన కంపెనీ కన్నా ఎక్కువ క్రెడిట్ రేటింగ్ ఉంటుంది.
ఒక ఇన్వెస్ట్మెంట్ నుండి రిటర్నులు ఇమిడి ఉన్న రిస్కుతో నేరుగా జోడించబడి ఉంటాయి. సాధారణంగా డెట్ సెక్యూరిటీలు ఈక్విటీల కన్నా తక్కువ రిస్కుగా పరిగణించబడుతాయి. అలా, తక్కువ రిస్కు ఇన్వెస్ట్మెంట్లు స్థిరాదాయం లాంటివి ఈక్విటీ ఫండ్స్ లాగా కాకుండా తక్కువ రిటర్నులు అందిస్తాయి