మీరు జీవితంలో ఎన్నో లక్ష్యాలను, కలలనూ కలిగి ఉండవచ్చు. ఆ కలలను సాకారం చేసుకోవడానికీ, లక్ష్యాలను సాధించడానికీ మీరు మీ కష్టార్జితాన్ని పెట్టుబడి పెడతారు. మీరు ఉన్నంత కాలం, ఆ తదనంతరం కూడా, మీ ఆప్తులు తమ కలలను సాకారం చేసుకునేందుకు కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చు.
ప్రతి వ్యక్తికీ జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి, సాకారం చేసుకోవలసిన కలలు ఉంటాయి. ప్రతి లక్ష్యానికీ ఒక ప్రణాళిక కూడా అవసరం, ఆర్ధిక ప్రణాళిక అనేది మరీ ప్రథానంగా. ఎవరైనా తమ కలల్ని నిజం చేసుకునేందుకూ,తమ ఆప్తుల కలలను, కోరికలను నెరవేర్చేందుకూ తమ కష్టార్జితాన్ని పెట్టుబడి పెడతారు.
జీవితం మనం అనుకున్నట్లుగా సాగదు, ఎన్నో అనుకోని సంఘటనలు జరగవచ్చు. తమ తదనంతరం తమ పెట్టుబడులు ఆటోమ్యాటిక్ గా తన జీవిత భాగస్వామికి గానీ పిల్లలకు గానీ చేరాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కానీ నిజ జీవితంలో, అది అంత సులువైన ప్రక్రియ కాదు. అది ఎలానో తెలుసుకునేందుకు, రాజీవ్ గుప్తా ఉదాహరణను తీసుకుందాం.
రాజీవ్ గుప్తా నాలుగు పోర్ట్ ఫోలియోలను రూపొందించారు, ఒకటి తన లక్ష్యాల కోసం, ఒకటి తన భార్య యొక్క ఆర్ధిక భద్రత కోసం, ఇక మిగిలినవి తన పిల్లల చదువుల కోసం. అతని మ్యూచువల్ ఫండ్
మరింత చదవండి