సిస్టమాటిక్ ట్రాన్స్ؚఫర్ ప్లాన్ (STP) లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్ؚమెంట్ ప్లాన్ؚలు (SIP) ఒక నిర్ణీత ఫ్రీక్వెన్సీలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడానికి సహాయపడతాయి. అయితే, అవి పనిచేసే విధానంలో వ్యత్యాసం ఉంటుంది. SIP మరియు STP మధ్య వ్యత్యాసాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం.
1. SIP: SIP అనేది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి ఒక విధానం. రోజువారీ, వారంవారీ, నెలవారీ, త్రైమాసిక మొదలైన క్రమమైన వ్యవధిలో ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకంలో స్థిర పెట్టుబడి పెట్టడానికి ఇది పెట్టుబడిదారుడిని అనుమతిస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమబద్ధమైన మరియు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానం.
2. STP: ఒక పెట్టుబడిదారుడు ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నుండి అదే ఫండ్ హౌస్ యొక్క మరొక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు డబ్బును బదిలీ చేయవచ్చు. ఒక STPతో, ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ నుండి మరొక మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు బదిలీ చేయడానికి నిర్ణీత మొత్తం ముందుగానే నిర్ణయించబడుతుంది. అస్థిరతను తగ్గించడానికి పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారులు ఈ వ్యూహాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
ఈ రెండు లక్షణాలు ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి, కాబట్టి, మనం కొన్ని ఉదాహరణలతో SIP Vs STPని మరియు అవి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకుందాం.
SIP ఉదా:
SIP రూపంలో మ్యూచువల్ ఫండ్ؚలో పెట్టుబడి పెట్టాలనుకునే పెట్టుబడిదారుడు ముందుగా సరైన మ్యూచువల్ ఫండ్ؚను ఎంచుకుని, ఇన్వెస్ట్ؚమెంట్ ఫ్రీక్వెన్సీని (ఉదా. ప్రతి నెల) ఎంచుకుని, తాను ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలనుకున్న మొత్తాన్ని (ఉదా. రూ. 10,000), స్కీమ్‌ను సెటప్ చేసి, తమ బ్యాంక్ అకౌంట్ నుండి ఎంచుకున్న ఫండ్‌కు ఆటోమేటిక్ డెబిట్‌ను ఎంచుకోవాలి. దీని ద్వారా ఎంపిక చేసిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్ؚలో SIP ద్వారా రూ.10,000 పెట్టుబడి పెట్టవచ్చు.
STP ఉదా:
ఒక పెట్టుబడిదారుడుకు రూ.20 లక్షల కార్పస్ ఉంటుంది కానీ మార్కెట్లు అస్థిరంగా ఉన్నందున పెట్టుబడిదారుడు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు. అందువల్ల, అతడు/ఆమె మొత్తం ఇరవై లక్షలను సాపేక్షంగా తక్కువ అస్థిరత్వం కలిగిన స్వల్పకాలిక డెట్ ఫండ్లలో పెట్టుబడి పెడతారు. అప్పుడు, అతను/ఆమె ఫండ్ కోసం ఒక STPని ఏర్పాటు చేయవచ్చు, అక్కడ తన డెట్ ఫండ్ల నుండి డబ్బును క్రమం తప్పకుండా ఎంచుకున్న ఈక్విటీ ఫండ్లలోకి బదిలీ చేయవచ్చు.
ఒకే ఫండ్ హౌస్ నుండి మ్యూచువల్ ఫండ్ పథకాలతో STPలను సెటప్ చేసుకోవచ్చు. పెట్టుబడిదారుడు ఒక ఫండ్ హౌస్ؚలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పథకాలతో STPని ఏర్పాటు చేసుకోవచ్చు. పెట్టుబడి పెట్టిన డెట్ ఫండ్‌లో ఏదైనా ఎగ్జిట్ లోడ్ ఉందో లేదో పెట్టుబడిదారుడు తనిఖీ చేసుకోవాలి.
డిస్క్లైమర్
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.