ఎడమ వైపున ఉన్న వీడియోని చూడటం ద్వారా, అన్ని పరిస్థితులలో, తక్కువ కాలానికి డబ్బు పెరగకుండా ఉండటం మీరు గమనిస్తారు. కొన్ని సందర్భాలలో, డబ్బుని ఖచ్చితంగా తీసుకునే సమయం కూడా తెలియకపోవచ్చు. ఇన్వెస్టర్ ఏమి చేయాలి? డబ్బుని ఎక్కడ ఉంచాలి?
ఇక్కడ ఎవరైనా కొన్ని విషయాలను తప్పక పరిగణించాలి:
- డబ్బు తక్కువ కాలం పార్క్ చేయబడింది
- ఎవరైనా పెట్టుబడి విలువ తగ్గకూడదని ఇష్టపడతారు
- డబ్బు సురక్షితం అని అనుకుంటే, తక్కువ రిటర్న్లు అయిన ఫరవాలేదు
- కాలం ఫిక్సిడ్ కావచ్చు లేదా తెలియకపోవచ్చు కూడా
పై సందర్బాలు తెలిసినప్పుడు, డబ్బుని ఫిక్సిడ్ డిపాజిట్లో ఉంచడం, ఉద్దేశ్యానికి పనికిరావచ్చు, కానీ ఒక పరిమితమైన పరిధి వరకు మాత్రమే. ఫిక్సిడ్ డిపాజిట్ పెద్ద ప్రయోజనాలలో ఒకటి సురక్షత. అదే సమయంలో, పరిమితులలో ఒకటి సాధారణంగా గమనించం - డబ్బు ఫిక్సిడ్ కాలానికి మాత్రమే పార్క్ చేయబడుతుంది- పార్కింగ్ కాలం లొ అనుకూలత ఉండదు.
అక్కడే లిక్విడ్ మ్యుచువల్ ఫండ్స్ పరిగణించవచ్చు. వీడియోలో కూడా తెలిపినట్లు, సహేతుకంగా మంచి రిటర్నులు (సేవింగ్స్ అకౌంట్లు లేదా షార్ట్ టర్మ్ డిపాజిట్లతో పోలిస్తే ) మరియు ఏసమయంలోనైనా రిడెంషన్కు పూర్తి అనుకూలతను అవి అందజేస్తాయి.